Asia Cup 2025 | సూపర్ ఓవర్ డ్రామా: శనకా ఔట్ అయి కూడా ఎలా నాట్ అవుట్ అయ్యాడు?
ఆసియా కప్ సూపర్ ఓవర్‌లో దసున్ షనక రనౌట్ నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఎంసీసీ నియమాలు, అంపైర్ నిర్ణయాల వివరాలు – తాజా తెలుగు క్రికెట్ న్యూస్.

Super Over Drama: Why Dasun Shanaka Was Declared Not Out Despite Being Run Out? ఆసియా కప్‌లో నిన్న భారత్-శ్రీలంక మధ్య జరిగిన సూపర్ ఓవర్ ఒకింత గందరగోళంగా సాగింది. దాసన్ షనకతో జరిగిన ఒక సంఘటన మాత్రం అభిమానులను అయోమయానికి గురిచేసింది. క్యాచ్ అవుట్ లా అనిపించిందీ, రన్ అవుట్ లా కూడా కనిపించింది, కానీ చివరికి రెండు సందర్భాల్లోనూ నాట్ అవుట్‌గా ప్రకటించబడ్డాడు. ఇది ఎలా జరిగింది?
సంఘటన ఎలా జరిగింది?
అర్ష్‌దీప్ వేసిన యార్కర్‌ని షనక మిస్ అయ్యాడు. దాన్ని క్యాచ్ అందుకున్న కీపర్ సాంజూ శాంసన్, బౌలర్, క్యాచ్ బిహైండ్ కోసం అప్పీల్ చేశారు. అదే సమయంలో షనక క్రీజ్ బయట ఉండగా, శాంసన్ స్టంప్స్‌ను డైరెక్ట్ హిట్ చేశాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ కొంత మొదట క్యాచ్ అవుట్ ఇచ్చాడు. షనక వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని నిర్ధారించడంతో, క్యాచ్ అవుట్ నిర్ణయం రద్దు చేయబడింది. ఆశ్చర్యంగా రనౌట్ కూడా అయిన షనక మళ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. దీంతో భారత జట్టుతో సహా అంతా అశ్చర్యపోయారు.
డెడ్ బాల్ రూల్ – రన్ అవుట్ ఎందుకు లెక్కలోకి రాలేదు?
ఎంసీసీ (మేరిలీబోన్ క్రికెట్ క్లబ్) చట్టం 31.1 ప్రకారం, “డిస్మిసల్‌కు కారణమైన ఘటన జరిగిన క్షణం నుంచి బంతి డెడ్‌గా పరిగణించబడుతుంది.” ఈ సందర్భంలో, క్యాచ్ అపీల్ మొదటి ఘటన కాబట్టి శాంసన్ రనౌట్ ప్రయత్నం చేసే సమయానికే బంతి డెడ్ అయింది. రీప్లేలో క్యాచ్ ఔట్ కాదని మూడో అంపైర్ నిర్ధారించాడు. అక్కడితో ఆ బాల్ కథ సమాప్తమైంది కనుక రనౌట్ కూడా చెల్లదని నిర్ణయించబడింది. ఈ నిర్ణయం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ఆశ్చర్యపరిచింది, ఆయన అంపైర్లతో చర్చించారు.
ఫలితం – అభిమానుల్లో గందరగోళం
- క్యాచ్ అవుట్ – నాట్ అవుట్ (తాకలేదు)
- రన్ అవుట్ – నాట్ అవుట్ (బంతి అప్పటికే డెడ్)
- చివరికి షనక సేఫ్… కానీ తర్వాతి బంతికే అవుట్. ఈసారి నిజంగానే ఔట్.
భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అంపైర్లను ఆడిగాడు. కానీ క్రికెట్ నిబంధన షనకను కాపాడింది. శ్రీలంక కోచ్ జయసూర్య కూడా “నిబంధనల ప్రకారం మొదటి నిర్ణయమే సరైంది, రెండోది కాదు” అన్నారు. అభిమానులకు మాత్రం ఈ రూల్ అస్సలు మింగుడుపడలేదు.
అయితే ఈ సూపర్ ఓవర్ డ్రామాలో షనకను నిబంధన కాపాడినా, తర్వాతి బంతికి ఔట్ అవడంతో, భారత్ విజయం సాధించడాన్ని మాత్రం ఆపలేకపోయింది.