Australia vs England : యాషెస్ రెండో టెస్టులో జోరూట్ సెంచరీ..ఇంగ్లాండ్ 325/9

యాషెస్ సిరీస్ రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ 325/9 స్కోర్ చేసింది. సీనియర్ బ్యాటర్ జో రూట్ అజేయ సెంచరీ (135) చేయగా, ఓపెనర్ క్రాలే 76 పరుగులు చేశాడు.

Australia vs England : యాషెస్ రెండో టెస్టులో జోరూట్ సెంచరీ..ఇంగ్లాండ్ 325/9

విధాత: బ్రిస్బెన్ గబ్బా వేదికగా యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ తొలి రోజు ఆటలో 325/9 స్కోర్ సాధించింది. సీనియర్ బ్యాటర్ జోరూట్ అజేయ సెంచరీ(135)తో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయగలిగింది. ఓపెనర్ క్రాలే 76 పరుగులతో రాణించారు. జోరూట్ తన టెస్టు కెరీర్ లో 40వ సెంచరీ సాధించడం విశేషం. అస్ట్రేలియాలో తొలి సెంచరీ కావడం గమనార్హం. అసీస్ బ్యాటర్లలో నలుగురు డకౌట్ కావడం విశేషం. ఆట ప్రారంభంలో అస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు ఇంగ్లాండ్ 5పరుగులకే 2వికెట్లు కోల్పోయింది. డకెట్(0), ఓలిపోప్ (0)లను అసీస్ బౌలర్ స్టార్క్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దీంతో మరో ఓపెనర్ క్రాలేతో కలిసి జోరూట్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. క్రాలే అవుటయ్యాక మళ్ళీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ కుప్పకూలింది. హరీ బ్రూక్ (31), స్టోక్స్ రనౌట్ (19), జెమీ స్మీత్(0), జాక్స్ (19), అట్కిన్సన్(4), కార్స్ (0)కు అవుటయ్యారు. ఆట ముగిసే సమయానికి జోఫ్రా అర్చర్(32) నాటౌట్ తో కలిసి జోరూట్ క్రీజ్ లో ఉన్నారు. 10వ వికెట్ కు వారిద్దరు 61పరుగులు జోడించి ఇంగ్లాండ్ ను ఆదుకున్నారు. తొలి రోజు ఆట 74ఓవర్లు మాత్రమే సాగింది.

అస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6వికెట్లు, మైకెల్ నెసర్, బోలాండ్ చెరో వికెట్ సాధించారు. ఈ టెస్ట్‌ లో 6వికెట్లు సాధించిన స్టార్క్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌గా పాకిస్తాన్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. హ్యారీ బ్రూక్‌ వికెట్‌ తీయడంతో స్టార్క్‌ ఖాతాలో ఈ రికార్డు వచ్చి చేరింది. వసీం అక్రమ్‌ 104 టెస్ట్‌ల్లో 414 వికెట్లు తీయగా.. స్టార్క్‌ 102వ టెస్ట్‌లోనే ఈ ఘనత సాధించాడు.

ఇవి కూడా చదవండి :

Akhanda 2 | స్కోప్ లేద‌ని ఆ పాత్ర‌కి దండ వేశాం.. బాల‌య్య కామెంట్స్ వైర‌ల్
YS Jagan : గోబెల్స్ కు చంద్రబాబు టీచర్