Gambhir| గంభీర్ రాక‌తో ఆ ముగ్గురి భ‌విష్య‌త్‌పై అయోమ‌యం.. వారు రిటైర్మెంట్ తీసుకోవ‌ల్సిందేనా..!

Gambhir| టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుని ఫీల్డ్‌లోకి దిగని గంభీర్ అప్పుడే వ్యూహాల‌ని అమ‌లు చేస్తూ అంద‌రు నోరెళ్ల‌పెట్టేలా చేస్తున్నాయి. ఈ నెల 27 నుంచి శ్రీలంకతో ప్రారంభం అయ్యే టీ20 సిరీస్‌తో గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా ఛార్జ్ అందుకోనున్న విష‌యం తెలిసిందే. శ్రీలంకతో మూడు

  • By: sn    sports    Jul 20, 2024 7:10 AM IST
Gambhir| గంభీర్ రాక‌తో ఆ ముగ్గురి భ‌విష్య‌త్‌పై అయోమ‌యం.. వారు రిటైర్మెంట్ తీసుకోవ‌ల్సిందేనా..!

Gambhir| టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుని ఫీల్డ్‌లోకి దిగని గంభీర్ అప్పుడే వ్యూహాల‌ని అమ‌లు చేస్తూ అంద‌రు నోరెళ్ల‌పెట్టేలా చేస్తున్నాయి. ఈ నెల 27 నుంచి శ్రీలంకతో ప్రారంభం అయ్యే టీ20 సిరీస్‌తో గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా ఛార్జ్ అందుకోనున్న విష‌యం తెలిసిందే. శ్రీలంకతో మూడు టీ20 సిరీస్‌తో పాటు మూడు వన్డేలు ఆడనుంది భారత జట్టు. అయితే రీసెంట్‌గా టీ20, వన్డే జట్టును ప్రకటించారు. ఇందులో T20 నుంచి రిటైర్ అయిన జడేజాతో పాటు, ఇతర ఇద్దరు భారత ఆటగాళ్లని ఎంపిక చేయ‌లేదు. దీంతో వారి నిష్క్రమణకు మార్గం చూపినట్లు అయిందా అనే చర్చ న‌డుస్తుంది.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీతో పాటు జడేజా కూడా టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే వీరు ముగ్గురు వ‌న్డే, టెస్ట్‌లు ఆడ‌నున్నారు. శ్రీలంక‌తో మరి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నున్న‌ వ‌న్డే సిరీస్ కోసం రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీల‌ని ఎంపిక చేశారు. కాని జ‌డేజాని మాత్రం ఎంపిక చేయ‌లేదు. ఇప్పుడు జ‌ట్టులో యువ ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే అద్భుతంగా రాణిస్తుండటంతో జ‌డ్డూ అంకం ముగిసిన‌ట్టేన‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్ ఇప్పుడు టీ20 వరల్డ్‌ కప్‌ 2026, వన్డే వరల్డ్‌ కప్‌ 2027ను టార్గెట్‌గా చేసుకొని కొత్త టీమ్‌ని నిర్మించాల‌ని ఉన్నాడు.

మ‌రోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భార‌త్‌ని ఎలాగైన గెలిపించాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆట‌గాళ్ల విషయంలో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడు. ఇక టీ20 స్పెష‌లిస్ట్ బ్యాట్స్‌మెన్‌ని వ‌న్డే నుండి త‌ప్పించి అతని స్థానంలో రియాన్ పరాగ్‌కు మిడిల్ ఆర్డర్‌లో అవకాశం కల్పించారు. మ‌రోవైపు యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం శ్రీలంకతో T20, ODI సిరీస్‌లకు దూరమయ్యాడు. అత‌ను త‌న స‌త్తా చూపించే అవ‌కాశం అందుకోలేపోతున్నాడు. చూస్తుంటే అత‌ని కెరీర్‌కి కూడా పులిస్టాప్ ప‌డ్డ‌ట్టే అని విశ్లేష‌కులు అంటున్నారు. చూస్తుంటే జ‌డేజా, సూర్య కుమార్, యాద‌వ్, చాహ‌ల్ వ‌న్డే కెరీర్ ప్ర‌మాదంలో ప‌డ్డట్టే అని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.