IND vs NZ|రాణించిన టీమిండియా బౌల‌ర్స్.. నిరాశ‌ప‌రుస్తున్న బ్యాట్స్‌మెన్స్

IND vs NZ|మొద‌టి రెండు టెస్ట్‌ల‌లో తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన టీమిండియా మూడో టెస్ట్ మ్యాచ్ అయిన నెగ్గి ప‌రువు కాపాడుకుంటుందేమోన‌ని అంద‌రు భావించారు. కాని చూస్తుంటే టీమిండియా ప‌రిస్థితి అదే మాదిరిగా ఉంది. ముందుగా టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో

  • By: sn    sports    Nov 01, 2024 5:08 PM IST
IND vs NZ|రాణించిన టీమిండియా బౌల‌ర్స్.. నిరాశ‌ప‌రుస్తున్న బ్యాట్స్‌మెన్స్

IND vs NZ|మొద‌టి రెండు టెస్ట్‌ల‌లో తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన టీమిండియా మూడో టెస్ట్ మ్యాచ్ అయిన నెగ్గి ప‌రువు కాపాడుకుంటుందేమోన‌ని అంద‌రు భావించారు. కాని చూస్తుంటే టీమిండియా ప‌రిస్థితి అదే మాదిరిగా ఉంది. ముందుగా టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో న్యూజిలాండ్ 235 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీసాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 86 ప‌రుగుల‌కి నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల‌లో ప‌డింది. . కెప్టెన్ రోహిత్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లతో 18) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక లైఫ్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌‌లో స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అనూహ్యమైన బౌన్స్‌ను ఆడలేక మూల్యం చెల్లించుకున్నాడు. య‌శ‌స్వి జైస్వాల్‌(30), సిరాజ్ (0), కోహ్లీ(4) ప‌రుగుల‌కి ఔట్ కాగా, ప్ర‌స్తుతం క్రీజులో గిల్‌(31 ), రిష‌బ్ పంత్(1 ) ఉన్నారు.

ఎప్ప‌టి మాదిరిగానే కోహ్లీ అభిమానుల‌ని ఉత్సాహ‌ప‌రిచాడు. ముంబైలోని వాంఖడే మైదానం లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఫీల్డింగ్ చేస్తూ ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించే ప్రయత్నం చేశాడు.అభిమానులు పాడిన ‘మై నేమ్ ఈజ్ లకాన్’అనే హిందీ పాటకు కాలు కదిపి వారిని సంతోషపరిచాడు. కోహ్లీ రెస్పాన్స్‌తో రెచ్చి పోయిన అభిమానులు ఆ పాటను మరింత గట్టిగా పాడారు. ఫ్యాన్స్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న విరాట్ కోహ్లీ.. వారికి దండం పెట్టాడు. ‘మీకో దండం.. నా వల్ల కాదు అన్న‌ట్టుగా కోహ్లీ ఎక్స్‌ప్రెష‌న్ ఉంది. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా వైర‌ల్ అవుతుంది.