Blind T20 Worldcup | చరిత్ర సృష్టించారు.. వరల్డ్ కప్ గెలిచిన భారత్
అంధులు అయితేనేమీ.. లోకాన్ని చూడలేకపోయినా విశ్వవిజేతలుగా నిలిచారు. టీ20 అంధుల మహిళా వరల్డ్ కప్ ను భారత జట్టు ముద్దాడింది. ఆదివారం నేపాల్ జట్టు తో జరిగిన ఫైనల్‌లో భారత అమ్మాయిలు అలవోకగా విజయం సాధించారు.
అంధులు అయితేనేమీ.. లోకాన్ని చూడలేకపోయినా విశ్వవిజేతలుగా నిలిచారు. టీ20 అంధుల మహిళా వరల్డ్ కప్ ను భారత జట్టు ముద్దాడింది. ఆదివారం నేపాల్ జట్టు తో జరిగిన ఫైనల్‌లో భారత అమ్మాయిలు అలవోకగా విజయం సాధించారు. పీ.సారా ఓవల్ ముగిసిన ఈ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఓడించి జగజ్జేతగా నిలిచింది. మొదటగా బ్యాటింగ్ చేసిన నేపాల్ టీం 20 ఓవర్లలో 114 పరుగుల చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఇక చేజింగ్ లో భారత జట్టు కేవలం 12 ఓవర్లలో 117 రన్స్ చేసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్ వేసింది. దీంతో నేపాల్ ప్లేయర్లు వేగంగా పరుగులు సాధించంలో విఫలమయ్యారు. 20 ఓవర్లలో కేవలం ఒక్క బౌండరీ మాత్రమే కొట్టడం గమనార్హం. దీంతో 114 పరుగులే చేయగలిగింది. నేపాల్ జట్టులో 35 పరుగులు చేసిన ఘిమిరే ట్యాప్ స్కోరర్ గా నిలిచారు. ఇక ఛేజింగ్ దిగిన భారత టీమ్ ఆడుతు పాడుతూ లక్ష్యాన్ని చేరింది. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా 12 ఓవర్ లల్లోనే టార్గెట్ రీచ్ అయింది. ఓపెనర్ పూలా సరెన్ 27 బంతుల్లోనే 44 రన్స్ చేసి భారత్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచారు. అలాగే, సెమీస్ మ్యాచ్ లో ఆసీస్ ను చిత్తు చేసిన ఇండియన్ టీమ్ ఫైనల్ లో కూడా తన జోరును చూపింది. అయితే, ఇది భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు తొలి టి20 వరల్డ్ కప్ కావడం విశేషం. ఈ విజయంతో భారత అంధుల జట్టు వరల్డ్ కప్ లో(వన్డేలు, టీ20లు) మొత్తం కలిపి ఆరు టైటిల్స్ సాధించాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram