ED Summons Shikar Dhawan : బెట్టింగ్ యాప్ కేసులో శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు

బెట్టింగ్ యాప్ కేసులో శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు జారీ, వన్ ఎక్స్ బెట్ ప్రమోషన్, ఆర్థిక లావాదేవీలపై విచారణ సాగుతోంది.

ED Summons Shikar Dhawan : బెట్టింగ్ యాప్ కేసులో శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు

న్యూఢిల్లీ : బెట్టింగ్ యాప్(Betting App) కేసులో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ కు(Shikar Dhawan) ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ధావన్ వాంగ్మూలం నమోదు చేశారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు ధావన్ ను విచారించారు. వన్ ఎక్స్ బెట్ అనే యాప్ ప్రమోషన్ చేశారు. యాప్ తో ఆయనకు ఉన్న సంబంధాలు.. ఆర్థిక లావాదేవిలపై ప్రశ్నించారు.

అక్రమ బెట్టింగ్ యాపుల ద్వారా ప్రజల నుంచి కోట్లాది రూపాయల కొల్లగొట్టడం.. పన్నులు ఎగవేయడం వంటి పలు కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈడీ(ED) అక్రమ బెట్టింగ్ యాప్ లపై ఫోకస్ పెట్టింది. ధావన్ ను విచారించిన కేసులోనే గత నెలలో మరో మాజీ క్రికెటర్ సురేష్ రైనా(Suresh Raina) ను ప్రశ్నించింది. అంతకుముందు పలువురు సినీ నటులను, సెలబ్రేటీలను విచారించింది. ఇటీవల దేశంలో రియల్ మనీ, ఆన్‌లైన్‌ గేమింగ్‌ను బ్యాన్ చేస్తూ చట్టం ఆమోదించబడింది.