Rwanda Fanny Utagushimuninde : చిన్న దేశం రువాండా బ్యాటర్..పెద్ద రికార్డు

రువాండా యువ బ్యాటర్ ఫ్యానీ ఉటగుషిమనిండే 15 ఏళ్ల వయసులోనే టీ20ల్లో శతకం చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.

Rwanda batter Fanny Utagushimuninde

విధాత : చిన్న దేశం రువాండా బ్యాటర్ ఫ్యానీ ఉటగుషిమనిండే ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అతిపిన్న వయసులోనే శతకం చేసిన క్రికెటర్‌గా ఆమె సరికొత్త రికార్డ్‌ సాధించింది. ఘనాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 65బంతుల్లోనే ఫ్యానీ శతకం (111*) చేసింది. 15 ఏళ్ల 223 రోజుల్లో ఆమె ఈ ఘనత అందుకుంది. ఫ్యానీకి ఇదే తొలి ఇంటర్నేషనల్‌ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం. అంతకుముందు ఉగాండా ప్లేయర్‌ ప్రోస్కోవియా అలకో (16 ఏళ్ల 233 రోజులు) పేరు మీద ఉన్న ఈ రికార్డును చెరిపేసింది.

ఫ్యానీ రికార్డు సెంచరీతో ఉగాండా 20ఓవర్లలో 3 వికెట్లకు 210 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఘనా 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 88పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఉగాండా 122పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి :

KCR : కేసీఆర్ ను కలిసిన మహమ్మద్ కుటుంబం
Expiry Date On Eggs : మీకు తెలుసా? కోడిగుడ్డుకూ ఉంది..ఓ ఎక్స్ పైరీ డేట్ !

Latest News