• Telugu News
  • /Hyderabad

KCR : కేసీఆర్ ను కలిసిన మహమ్మద్ కుటుంబం

రంజాన్ సందర్భంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌ను మహమ్మద్ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Mar 21, 2026, 5:36 pm IST
Read Time: 2 mins
KCR : కేసీఆర్ ను కలిసిన మహమ్మద్ కుటుంబం

విధాత, హైదరాబాద్ : రంజాన్ పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను శనివారం ఎర్రవెల్లి నివాసంలో వారి చిన్ననాటి స్నేహితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహమ్మద్ జహంగీర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జుబేర్ మహమ్మద్, వారి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో వారు కేసీఆర్ ను కలిసి రంజాన్ నెల ముగింపు సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్ కు టోపి బహుకరించి ధరింప చేశారు.

ఈ సందర్భంగా వారికి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. స్నేహితులు, పార్టీ శ్రేణులతో కలిసి రంజాన్ సంబరాలలో కేసీఆర్ ఆత్మీయంగా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు : కేటీఆర్
Komatireddy : కృష్ణా కాలువల పరిశీలనకు మంత్రి వెంకట్ రెడ్డి బైక్ రైడింగ్ !