ఆకట్టుకుంటున్న.. తెలుగు క్రికెటర్‌ తిలక్ వర్మ పచ్చబొట్టు

  • Publish Date - October 6, 2023 / 11:02 AM IST

  • హాఫ్ సెంచరీతో వెలుగులోకి


విధాత: టీమ్ ఇండియా క్రికెటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తన తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను వినూత్నంగా వ్యక్తపరిచిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఆసియన్ గేమ్స్‌లో భాగంగా జరుగుతున్న క్రికెట్ పోటీల్లో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు.


అయితే హాఫ్ సెంచరీ పూర్తయ్యాక తిలక్ వర్మ తన షర్ట్‌ను పైకి లేపి తన పక్కటెముక భాగానా వేయించిన తల్లిదండ్రుల పచ్చబొట్టును చూపుతూ అభివాదం చేశాడు. తల్లిదండ్రుల పట్ల ప్రేమను పిల్లలు తలోరకంగా ప్రదర్శించడం జరుగుతుండగా, తిలక్ వర్మ మాత్రం వారి చిత్రాలతో కూడి పచ్చబొట్టు టాట్ వేయించుకోవడం వినూత్నంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నా

Latest News