ఆసియా క్రీడల్లో దుమ్మురేపుతున్న భారత ఆటగాళ్లు..! ఆర్చరీలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన అమ్మాయిలు..

ఆసియా క్రీడల్లో దుమ్మురేపుతున్న భారత ఆటగాళ్లు..! ఆర్చరీలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన అమ్మాయిలు..

విధాత‌: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటి వరకు 82 పతకాలకుపైగా పతకాలు సాధించారు. ఇవాళ జరిగిన ఆర్చరీలోనూ మహిళ క్రీడాకారులు అత్యుతమ ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాన్ని గెలుపొందారు. తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం, అదితి స్వామి, పర్నీత్‌ కౌర్‌ బృందం ఆర్చరీ మహిళా టీమ్‌ కాంపౌండ్‌ విభాగంలో చైనీస్‌ తైపీకి చెందిన యి-హ్సువాన్ చెన్, ఐ జౌ హువాంగ్, లు-యున్ వాంగ్‌లను ఓడించి స్వర్ణం సాధించారు.


ఈ బంగారు పతకంతో ఆసియా క్రీడల్లో 19 స్వర్ణాలు కాగా.. ఆసియా క్రీడల్లో ఆర్చరీ పోటీల్లో ఇది భారత్‌ రెండో పతకం కావడం విశేషం. అదే సమయంలో ముగ్గురు ఆర్చర్లు వ్యక్తిగత ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకోవడం మరిన్ని పతకాలు వచ్చే ఛాన్స్‌ ఉన్నది. చైనీస్‌ తైపీతో జరిగిన ఉత్కంఠ పోటీల్లో భారత ఆర్చర్లు 230 స్కోర్‌ సాధించగా.. తైపీ క్రీడాకారులు 228 పాయింట్లకే పరిమితమయ్యారు. దీంతో భారత్‌ ఖాతాలో 82 పతకాలు చేరాయి. ఇందులో 19 స్వర్ణాలు, 31 కాంస్యాలు, 32 రజత పతకాలు ఉన్నాయి. కాగా, ఆర్చరీలో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం.



 


అంతకుముందు మిక్స్‌డ్‌ టీమ్‌ కాంపౌండ్‌ ఫైనల్‌లో ఓజాస్‌ డియోటల్‌, జ్యోతి సురేఖ జట స్వర్ణం సాధించింది. అదేవిధంగా సునీల్‌ కుమార్‌, గ్రెసొ జంట రజతం పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక షట్లర్‌ పీవీ సింధు నిరాశపరిచింది. బ్యాడ్మింటన్‌ ఉమెన్స్‌ సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో చైనాకు చెందిన హి బిన్‌జియావో చేతిలో 16-21, 12-21 పాయింట్లతో ఓటమిపాలైంది. బిన్‌జియావో విజృంభించడంతో మ్యాచ్‌ మొత్తం ఏకపక్షంగా సాగింది.