Paris Olympics 2024| జననాంగం అడ్డు రావడంతో చేజారిన పతకం.. ఫన్నీ కామెంట్స్ చేసిన కామెంటేటర్స్
Paris Olympics 2024| ప్రస్తుతం పారిస్ వేదికగా ఒలంపిక్స్ జరుగుతుండగా, అథ్లెట్స్ పతకం దక్కించుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. పతకం సాధించి దేశ ప్రతిష్ట నిలబెట్టాలని ప్రతి అథ్లెట్ భావిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫ్రెంచ్ అథ్లెట్
Paris Olympics 2024| ప్రస్తుతం పారిస్ వేదికగా ఒలంపిక్స్ జరుగుతుండగా, అథ్లెట్స్ పతకం దక్కించుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. పతకం సాధించి దేశ ప్రతిష్ట నిలబెట్టాలని ప్రతి అథ్లెట్ భావిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫ్రెంచ్ అథ్లెట్ ఆంథోనీ అమ్మిరాటి విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొని పతకం చేజార్చుకున్నాడు. పురుషుల పోల్ వాల్ట్ ఈవెంట్‌లో జననాంగం అడ్డుపడడంతో అతను పతకం అందుకోకుండా అయింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పోల్ వాల్ట్ పోటీల్లో ఆంథోని అమ్మిరాటి నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు.

స్వీడెన్ అథ్లెట్ డుప్లాంటీస్, నార్వే ప్లేయర్ గుట్టోర్మెసెన్, గ్రీక్ ప్లేయర్ కరాలిస్ 5.75 మీటర్ల ఎత్తును క్లియర్ చేసి టాప్-3లో నిలిచారు.. ఆంథోని అమ్మిరాటి 5.60 మీటర్లు మాత్రమే దూకి నాలుగో స్థానానికే పరిమితమయ్యాడు. అయితే అతను 5.70 మీటర్లని క్లియర్ చేసే ప్రయత్నంలో జననాంగం అడ్డు తగలడంతో కామెంటేటర్స్ తమ వ్యాఖ్యానంతో నవ్వులు పూయించారు. అతని శరీరంలో విలువైన ఆస్థి అడ్డుగా తగిలింది అని ఓ కామెంటేటర్ కామెంట్ చేయగా.. మరొకరు అతనికి తగిన పరిహారం అందుతుందని ఫన్నీ కామెంట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటజన్స్ కూడా ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.
ఇక పోల్ వాల్ట్ గేమ్‌లో సూపర్ స్టార్ అయిన స్వీడెన్ అథ్లెట్ అర్మాండ్ గుస్తవ్ 5.75 మీటర్లను క్లియర్ చేసి బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ 24 ఏళ్ల స్వీడెన్ అథ్లెట్ పేరిట 6.24 మీటర్లతో పాటు 6.22 మీటర్ల ఎత్తును క్లియర్ చేసిన వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. పారిస్ ఒలంపిక్స్‌లో కూడా అతను జయకేతనం ఎగురవేసి పతకం దక్కించుకున్నాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram