Hardik Pandya| న‌టాషాతో విడాకుల రూమ‌ర్లు.. ఎట్ట‌కేల‌కి క్లారిటీ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా

Hardik Pandya| గ‌త కొద్ది రోజులుగా హార్ధిక్ పాండ్యా-న‌టాషా విడాకుల‌కి సంబంధించి నెట్టింట ఎన్ని వార్త‌లు హ‌ల్‌చల్ చేశాయో మ‌నం చూశాం. ఐపీఎల్ లో హార్దిక పాండ్యా కెప్టెన్సీగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయి పక్కకు వచ్చినప్పటి నుంచి ఈజంట మధ్య అగ్గిరాజుకుంది. దాని ప్రభావం వల్లే హార్దిక్ పాండ్యా భార్య నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ నుండి తన భర్త పేరును తొల‌గించింద‌ని, పెళ్లి ఫొటోలు కూడా డిలీట్ చేసింద‌నే టాక్ న‌డిచింది. ఇక హార్ధిక్ ఆస్తిలో 70 శాతం భ‌

  • Publish Date - June 14, 2024 / 06:39 AM IST

Hardik Pandya| గ‌త కొద్ది రోజులుగా హార్ధిక్ పాండ్యా-న‌టాషా విడాకుల‌కి సంబంధించి నెట్టింట ఎన్ని వార్త‌లు హ‌ల్‌చల్ చేశాయో మ‌నం చూశాం. ఐపీఎల్ లో హార్దిక పాండ్యా కెప్టెన్సీగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయి పక్కకు వచ్చినప్పటి నుంచి ఈజంట మధ్య అగ్గిరాజుకుంది. దాని ప్రభావం వల్లే హార్దిక్ పాండ్యా భార్య నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ నుండి తన భర్త పేరును తొల‌గించింద‌ని, పెళ్లి ఫొటోలు కూడా డిలీట్ చేసింద‌నే టాక్ న‌డిచింది. ఇక హార్ధిక్ ఆస్తిలో 70 శాతం భ‌ర‌ణం కూడా అడిగిన‌ట్టు ప్రచారాలు సాగాయి. అయితే వీరిద్ద‌రి విడాకుల‌కి సంబంధించి జోరుగా ప్రచారాలు సాగుతున్న స‌మ‌యంలో ఈ ఇద్దరు కలిసి పోయారనే ప్రచారం సాగింది. నటాషా కూడా తన ఇన్​స్టా అకౌంట్​లో హార్దిక్​ ఫొటోలను మళ్లీ పోస్ట్ చేసిందని అన్నారు. ఈ నేప‌థ్యంలో హార్దిక్ పాండ్యా మొదటిసారిగా తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ ప్రకటన చేయ‌డంతో అంద‌రికి ఒక క్లారిటీ వ‌చ్చింది.

టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్, భారత్‌ల మ‌ధ్య హోరా హోరీ ఫైట్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. లో స్కోరింగ్ గేమ్ అయిన కూడా మంచి మ‌జా అందించింది. భారత్ కేవలం 119 పరుగులకే కుప్పకూగా, పాక్ జ‌ట్టుని 113 పరుగుల‌కి క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు భార‌త్ బౌల‌ర్స్ . దీంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ భారత ఆటగాళ్లను ప్రశంసిస్తూ వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి స‌ర‌దాగా మాట్లాడారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్‌తో ముచ్చటించాడు. ఆ తర్వాత హార్దిక్‌, రికీ మధ్య చిన్న ఆసక్తికర కన్వర్జేషన్‌ జరిగింది.

‘రికీ! ఆల్​ ఈజ్‌ ఎవ్రీథింగ్‌? హౌ ఈజ్‌ యుర్​ ఫ్యామిలీ?’ అని హార్దిక్ పాండ్యా అడ‌గ‌గా, దానికి స్పందించిన రికీ పాంటింగ్.. ‘అందరూ బావున్నారు, నీ ఫ్యామిలీ ఎలా ఉంది?’ అని రికీ అడిగాడు. హార్దిక్ పాండ్యా, ‘ఆల్ గుడ్. ఆల్ స్వీట్’ అని బదులిచ్చాడు. దీంతో హార్దిక్‌ పాండ్యా విడాకుల వివాదానికి, రూమర్లకు ఫుల్‌ స్టాప్‌ పడింద‌ని భావిస్తున్నారు.షార్ట్ అండ్ స్వీట్‌గా త‌న ఫ్యామిలీతో సంతోషంగానే ఉన్న‌ట్టు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడ‌ని అంద‌రు భావిస్తున్నారు. ఈ వీడియోను ఐసీసీ యూట్యూబ్‌లో ఎ డే ఇన్ లైఫ్ ఆఫ్ రికీ పాంటింగ్ పేరుతో షేర్ చేయ‌గా, ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.ఇక ఐపీఎల్ లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన పాండ్యా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బాల్‌తో రాణిస్తున్నాడు.

Latest News