IND vs ZIM| ప‌సికూన చేతిలో భార‌త్ ఘోర ప‌రాజ‌యం..13 ప‌రుగుల తేడాతో గెలిచిన జింబాబ్వే

IND vs ZIM| చిన్న జ‌ట్టే క‌దా త‌క్కువ అంచ‌నా వేస్తే ఘోర‌ప‌రాజ‌యం చ‌విచూడ‌క త‌ప్ప‌దు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జ‌ట్ల‌ని చిన్న జ‌ట్లే ఇంటికి పంపించాయి.ఇక తాజాగా జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో భార‌త్‌పై ఘ‌న విజ‌యం సాధించింది జింబాబ్వే జట్టు. ఇటీవ‌ల టీ20వర‌ల్డ్ క‌ప్ గెలిచి విశ్వ వి

  • By: sn    sports    Jul 06, 2024 8:39 PM IST
IND vs ZIM| ప‌సికూన చేతిలో భార‌త్ ఘోర ప‌రాజ‌యం..13 ప‌రుగుల తేడాతో గెలిచిన జింబాబ్వే

IND vs ZIM| చిన్న జ‌ట్టే క‌దా త‌క్కువ అంచ‌నా వేస్తే ఘోర‌ప‌రాజ‌యం చ‌విచూడ‌క త‌ప్ప‌దు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జ‌ట్ల‌ని చిన్న జ‌ట్లే ఇంటికి పంపించాయి.ఇక తాజాగా జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో భార‌త్‌పై ఘ‌న విజ‌యం సాధించింది జింబాబ్వే జట్టు. ఇటీవ‌ల టీ20వర‌ల్డ్ క‌ప్ గెలిచి విశ్వ విజేత‌లుగా జింబాబ్వే గ‌డ్డపై అడుగుపెట్టింది భార‌త జ‌ట్టు. హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో యువ భారత్‌ను జింబాబ్వే జ‌ట్టు దారుణంగా ఓడించింది.శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని కుర్రాళ్ల జట్టు పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయకుండా.. పేలవ షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నారు.

ముందుగా జింబాబ్వే జ‌ట్టు బ్యాటింగ్ చేయ‌గా, నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 115 పరుగులే చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో క్లైవ్ మదాండే(25 బంతుల్లో 4 ఫోర్లతో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. బ్రియాన్ బెన్నెట్(22), వెస్లీ మధెవెరే(21), డియోన్ మేయర్స్(23) కాస్త విలువైన ప‌రుణులు చేశారు. జింబాబ్వే ఆట‌గాళ్ల‌లో న‌లుగురు బ్యాట‌ర్స్ డకౌట్ అయ్యారు. భార‌త బౌల‌ర్స్‌లో రవి బిష్ణోయ్(4/13), వాషింగ్టన్ సుందర్(2/11) జింబాబ్వేని త‌క్కువ ప‌రుగుల‌కి క‌ట్ట‌డి చేశారు. అయితే స్వ‌ల్ప ల‌క్ష్యంతో భార‌త్ బ‌రిలోకి దిగ‌గా, భార‌త్ విజ‌యం ఖాయమ‌ని అంద‌రు అనుకున్నారు.

కాని టీమిండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుబ్‌మన్ గిల్(29 బంతుల్లో 5 ఫోర్లతో 31), వాషింగ్టన్ సుందర్(34 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 27 ), ఆవేశ్ ఖాన్(12 బంతుల్లో 3 ఫోర్లతో 16) త‌ప్ప మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ అంద‌రు కూడా త‌క్కువ ప‌రుగుల‌కే ఔట్ అయ్యారు. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్ సుందర్‌ చివరి ఓవర్‌ వరకూ ఒంటరి పోరాటం చేసి భారత్‌ను గెలిపించే ప్ర‌య‌త్నం చేశాడు. కాని జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో టీమిండియా లక్ష్యానికి 13 పరుగుల దూరంలోనే ఆగిపోయింది . వారం రోజుల క్రితమే టీ20 ఫార్మాట్ విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా.. ఆ విజయాన్ని మరిచిపోకముందే పసికూన జింబాబ్వే చేతిలో ఘోర ఓటమిని చవిచూడ‌డం ఎవ‌రికి రుచించ‌డం లేదు.ఈ యేడాది టీ 20ల‌లో భార‌త్ కు ఇదే తొలి ప‌రాజ‌యం కాబ‌ట్టి 5 మ్యాచ్‌ల సిరీస్ కాబ‌ట్టి భార‌త్ తిరిగి పుంజుకొనే ఛాన్సుంది.