Rishabh Pant | టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌..!

Rishabh Pant | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ మొదలవనున్నది. అమెరికా, వెస్టిండిస్‌ సంయుక్తంగా పొట్టి కప్‌ను నిర్వహించనున్నాయి. జూన్‌ 2న వరల్డ్‌ కప్‌ మొదలవనున్నది. ఇక ఈ టోర్నీలో పాల్గొనే అన్ని జట్లకు సంబంధించిన ఆటగాళ్ల వివరాలను మే ఒకటిలోగా అందజేయాలని ఐసీసీ ఆయా దేశాల బోర్డులకు సూచించింది. ఇప్పటికే న్యూజిలాండ్‌ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

Rishabh Pant | టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌..!

Rishabh Pant | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ మొదలవనున్నది. అమెరికా, వెస్టిండిస్‌ సంయుక్తంగా పొట్టి కప్‌ను నిర్వహించనున్నాయి. జూన్‌ 2న వరల్డ్‌ కప్‌ మొదలవనున్నది. ఇక ఈ టోర్నీలో పాల్గొనే అన్ని జట్లకు సంబంధించిన ఆటగాళ్ల వివరాలను మే ఒకటిలోగా అందజేయాలని ఐసీసీ ఆయా దేశాల బోర్డులకు సూచించింది. ఇప్పటికే న్యూజిలాండ్‌ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇక భారత జట్టును మంగళ, బుధవారాల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. ఇక బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఖరారు చేసినట్లు సమాచారం. గాయం నుంచి కోలుకొని ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్‌ పంత్‌ టీమిండియాకు ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.

మెగా టోర్నీకి వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించబోతున్నారని తెలుస్తున్నది. నిన్నటి వరకు రోహిత్‌ శర్మకు డిప్యూటీగా వ్యవహరించిన హార్ధిక్‌ పాండ్యాపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఐపీఎల్ సీజ‌న్‌లో హార్దిక్ పూర్తిగా ఫామ్‌ను కోల్పోయాడు. అటు కెప్టెన్‌గా.. ఇటు ఆటగాడిగానూ విఫలమయ్యాయి. పాండ్యా సారథ్యంలోని ముంబయి వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసింది. ఇక ఆల్‌రౌండ‌ర్ పాత్రకు సైతం న్యాయం చేయ‌లేక‌పోతున్నాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా వైస్ కెప్టెన్సీ నుంచి త‌ప్పించాల‌ని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతున్నది. అటు పంత్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఇప్పటి వ‌ర‌కు 10 మ్యాచులు ఆడింది. ఇందులో ఐదింట్లో విజయం సాధించింది. ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. 10 పాయింట్లతో ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొనసాగుతున్నది.