టి20 పురుషుల ప్రపంచకప్‌లో భారత్ (India) బోణీ కొట్టింది. తన తొలిమ్యాచ్‌లో పసికూన ఐర్లండ్(Ireland)తో న్యూయార్క్, అమెరికాలో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
న్యూయార్క్: టి20 పురుషుల ప్రపంచకప్‌లో భారత్ (India) బోణీ కొట్టింది. తన తొలిమ్యాచ్‌లో పసికూన ఐర్లండ్(Ireland)తో న్యూయార్క్, అమెరికాలో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న ఇండియా నిర్ణయం సరైనదేనంటూ బౌలర్లు నిరూపించారు. న్యూయార్క్(New york) బౌన్సీ పిచ్‌పై అవగాహన ఉన్న రోహితో మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్‌నే తీసుకున్నాడు. భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ఐర్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ వికెట్ వెనుక వికెట్ తీస్తూ పోయారు. మొదట ఇన్నింగ్ మొదటి ఓవర్ బౌలింగ్ తీసుకున్న అర్షదీప్‌సింగ్, 3 పరుగులతో సరిపెట్టగా, రెండో ఓవర్ వేసిన సిరాజ్ ఒక ఫోర్‌తో 4 పరుగులు ఇచ్చాడు. తిరిగి మూడో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అర్షదీప్‌సింగ్ వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద ఉన్నప్పుడు మొదటి వికెట్ కోల్పోయిన ఐర్లండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.పవర్ ప్లే లో 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు మాత్రమే చేసిన ఐర్లండ్, చివరికి 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. ఐర్లండ్ జట్టులో నలుగురు రెండంకెల స్కోర్ చేయగా, ఒక్కరు మాత్రమే 20 పరుగు దాటగలిగారు. భారత బౌలర్లలో అర్షదీప్‌సింగ్(2), పాండ్యా(3), బుమ్రా(2) నిప్పుల్లాంటి బంతులతో ఐర్లండ్‌ను వణికించారు. సిరాజ్, అక్షర్ చెరో వికెట్ తీయగా, ఆఖరి వికెట్ నోబాల్‌లో రనౌట్‌గా కుప్పకూలింది.
తరువాత రోహిత్, కోహ్లీ ఓపెనర్లుగా ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్, మూడో ఓవర్లో కోహ్లీ(1) వికెట్ కోల్పోయింది. రోహిత్‌కు జత కలిసిన పంత్ నిదానంగా ఆడుతూ, రోహిత్‌కు మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ(52 : 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) భుజం గాయంతో రిటైర్డ్ హర్ట్గ్గా వెనుదిరగగా, వచ్చిన సూర్యకుమార్ యాదవ్(2) భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. తరువాత వచ్చిన శివం దూబె(0 నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుండా పంత్(36 నాటౌట్: 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మిగతా లాంఛానాన్ని పూర్తి చేసాడు. భారత్ తన లక్ష్యాన్ని 12.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 97 పరుగులు సాధించి చేరుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బుమ్రా(3–1–6–2) ఎంపికయ్యాడు.
ఐర్లండ్ బౌలర్లలో మార్క్ అడైర్ , బెన్ వైట్ చెరో వికెట్ తీసుకున్నారు.