Women World Cup 2025 | దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి : రిచా ఘోష్ పోరాటం వృథా
విశాఖపట్నంలో జరిగిన మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓడింది. రిచా ఘోష్ 94 పరుగుల అసమాన పోరాటాన్ని బౌలర్లు ఆఖర్లో తడబాటుకు గురై విజయంగా మలచలేకపోయారు.

India lose to South Africa by 3 wickets despite Richa Ghosh’s brilliant 94
విశాఖపట్నం:
మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టుకు నేటి మ్యాచ్ చేదు అనుభవం మిగిలింది. దక్షిణాఫ్రికా చేతిలో 3 వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో ఒక బంతి మిగిలుండగా 251 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
251 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా అమ్మాయిలు భారత బౌలింగ్ ధాటికి త్వరత్వరగా పెవిలియన్ బాట పట్టడంతో ఒక దశలో 81 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ, కెప్టెన్ వోల్వార్డ్, ట్రయాన్(49) పట్టుదలతో ఆడి జట్టును మళ్లీ రేసులో నిలబెట్టారు. కానీ, అప్పటికీ గెలుపు స్పష్టంగా కానరాకపోగా, వోల్వార్డ్(70) ఔట్ కావడంతో టీమ్ ఉలిక్కిపడింది. అప్పుడొచ్చిన ఆల్‌రౌండర్ నాడిన్ డిక్లెర్క్ (84* పరుగులు,54 బంతులు, 5 సిక్స్‌లు, 8 ఫోర్లు) అసమాన పోరాటపటిమతో దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చింది.
అంతకుముందు టాస్ ఓడి, బ్యాటింగ్‌కు దిగిన భారత్ మంచి ఆరంభాన్నే ఇచ్చింది. ఓపెనర్లు స్మృతిమంధనా, ప్రతీకా రావల్‌లు మొదటి వికెట్‌కు 55 పరుగులు జోడించగా, 83 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇక అక్కన్నుంచి వికెట్లు టపటపా రాలిపోవడంతో 102 పరుగులకే ఆరుగురు పెవిలియన్ చేరుకున్నారు. క్రీజ్‌లోకి వచ్చిన కీపర్ రిచా ఘోష్ దద్దరిల్లేపోయే ఆట ఆడడంతో భారత్ 251 పరుగులకు చేరుకుంది. 150 పరుగులే కష్టంగా మారిన పరిస్థితుల్లో రిచా అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి 77 బంతుల్లో 94 (9 ఫోర్లు, 2 సిక్సర్లు ) పరుగులు చేసి, జట్టుకు బలమైన స్కోరునందించింది. షఫాలీ వర్మలు త్వరగా అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. స్కోరు 102/6 వద్ద నిలిచినప్పుడు, రిచా ఘోష్ అద్భుతమైన ప్రతిఘటన కనబరిచింది. ఆమె 94 పరుగులు (107 బంతుల్లో, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి జట్టును నిలబెట్టింది. ఆమెతో కలిసి స్నేహ్ రాణా (33) విలువైన భాగస్వామ్యం అందించింది. ఈ జంట సహకారంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ట్రయాన్ (3/32) మంచి ప్రదర్శన కనబరిచింది.
చివరి 10 ఓవర్లలో భారత్‌కు అవకాశాలు ఉన్నా, కీలక క్యాచ్ మిస్‌లు, బౌలింగ్‌లో తడబాటు వల్ల ఆట చేతుల్లోనుండి జారిపోయింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు తీశారు.
ముఖ్యాంశాలు:
- రిచా ఘోష్ 94 పరుగులతో తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడింది.
- స్మృతిమంధనాకు ఇది వరుసగా ఐదో సారి డబుల్ డిజిట్ దాటినా పెద్ద స్కోరు చేయలేకపోయింది.
- వర్షం కారణంగా వాతావరణం తడి ఉండటం, పిచ్ నెమ్మదిగా మారడం రన్ చేజ్‌కు అనుకూలమైంది.
- దక్షిణాఫ్రికా గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరగా, భారత్ మూడో స్థానానికి దిగజారింది