Women’s T20 World Cup | టి20 ప్రపంచకప్​లో భారత అమ్మాయిల బోణీ – పాకిస్తాన్​పై ఘనవిజయం

మహిళల టి20 ప్రపంచకప్​లో రెండో మ్యాచ్​ ఆడిన భారత్​, బోణీ కొట్టింది. తొలుత పాక్​ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్​, స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.

Women’s T20 World Cup | టి20 ప్రపంచకప్​లో భారత అమ్మాయిల బోణీ – పాకిస్తాన్​పై ఘనవిజయం

Women’s T20 World Cup: దుబాయ్​ అంతర్జాతీయ స్టేడియం(Dubai International Stadium)లో జరిగిన మహిళల టి20 ప్రపంచకప్​ లీగ్​ మ్యాచ్​లో భారత్(India Women)​ పాకిస్తాన్(Pakistan Women)​పై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో ఇదే భారత్​కు తొలి విజయం. గత మ్యాచ్​లో న్యూజీలాండ్​(Newzealand Women) చేతిలో ఘోర పరాజయం పాలై తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడే పాకిస్తాన్​తో మ్యాచ్​ రావడం భారత్​కు ఇంకో టెన్షన్​గా మారింది. అయినా ఒత్తిడిని అధిగమించి, బౌలర్లు రాణించడంతో పాక్​ను కట్టడి చేయగలిగింది.

తొలుత టాస్​ గెలిచి, బ్యాటింగ్​ ఎంచుకున్న పాకిస్తాన్(Toss won by Pak)​ తనది ఎంత తప్పుడు నిర్ణయమో తొందరగానే తెలుసుకుంది. ఒక్క రన్​కే తొలి వికెట్​ చేజార్చుకున్న పాక్​, ఇక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 52 పరుగులకే 5 వికెట్లు పడేసుకున్న పాక్​ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. భారత బౌలర్​ అరుంధతి రెడ్డి మూడు వికెట్లతో చెలరేగిపోయింది. బౌలర్లందరూ వికెట్లు పంచుకోవడంతో, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పాకిస్తాన్​ 105 పరుగులు మాత్రమే చేయగలిగింది(105/8 in 20 overs). భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి(Arundhati Reddy) 3, శ్రేయాంక పాటిల్​ 2, రేణుకాసింగ్​, దీప్తి శర్మ, ఆశా శోభన తలో వికెట్​ తీసుకున్నారు.

అనంతరం స్వల్ప లక్ష్యచేధనలో భారత్​ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. షెఫాలీ వర్మ(32), జెమీమా(23), కెప్టెన్​ హర్మన్​ప్రీత్​(29) బ్యాటింగ్​లో కీలకపాత్ర పోషించారు. స్మృతి మంధాన 7 పరుగులకే అవుటైనప్పటికీ, లక్ష్యం చిన్నదవడంతో భారత్​ ఎక్కడా తడబడకుండా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది.
ఈ గెలుపుతో రెండు పాయింట్లు గెలుచుకున్న ఇండియా, ‌‌–1.2 రన్​రేట్​తో ఉంది. అగ్రస్థానంలో న్యూజీలాండ్​ 2 పాయింట్లతో, 2.9 రన్​రేట్​తో నిలబడింది.