ఆల్‌టైమ్ రికార్డు కొట్టిన 2024 ఐపీఎల్ మినీ వేలం

ఐపీఎల్ 2024 మినీ వేలం అంచనాలకు మించి ఆటగాళ్ల కొనుగోలులో ఆల్ టైం రికార్డు సృష్టించింది. దుబాయ్ వేదికగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలంలో మొత్తం పది ఫ్రాంచైజీలు 77 స్లాట్ల కోసం పోటీ పడ్డాయి

ఆల్‌టైమ్ రికార్డు కొట్టిన 2024 ఐపీఎల్ మినీ వేలం
  • 24.75కోట్లతో మిచెల్ స్టార్క్‌ను కొనుగోలు చేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్‌
  • 20.05కోట్ల రికార్డు ధరతో ప్యాట్ కమిన్స్‌ను దక్కించుకున్న సన్ రైజర్స్‌
  • భారీ ధర పలికిన ఆన్ క్యాప్డ్ ప్లేయర్లు


విధాత : ఐపీఎల్ 2024 మినీ వేలం అంచనాలకు మించి ఆటగాళ్ల కొనుగోలులో ఆల్ టైం రికార్డు సృష్టించింది. దుబాయ్ వేదికగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలంలో మొత్తం పది ఫ్రాంచైజీలు 77 స్లాట్ల కోసం పోటీ పడ్డాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు ఉన్నాయి. 2కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్‌ను 24.75 కోట్ల ఆల్‌టైమ్ రికార్డు ధరతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. స్టార్క్ కోసం నైట్‌రైడర్స్‌తో గుజరాత్ టైటాన్స్ పోటీపడింది. అంతకుముందే ఇదే వేలంలో ఆస్ట్రేలియా కేప్టెన్, పేసర్ ప్యాట్ కమిన్స్‌ను 20.05 కోట్ల రికార్డు ధరతో హైదరాబాద్ సన్ రైజర్స్ దక్కించుకుంది. ఆ రికార్డును స్టార్క్ వేలం అధిగమించింది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు శివమ్‌దూబె, సమీర్ రిజ్వీలను భారీ ధరలకు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చిన పేసర్‌ అల్జారీ జోసెఫ్‌ను 11.5కోట్లకు రాయల్ చాలెంజర్‌ బెంగుళూరు కొనుగోలు చేసింది.


2కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ఇంగ్లాండ్ ల్ రౌండర్ క్రిస్‌వోక్స్‌ను 4.2కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. 2కోట్లతో కనీస ధరతో ఉన్న భారత పేసర్ హర్షల్ పటేల్‌ను 11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. 2కోట్ల కనీస ధరతో ఉన్న శార్ధూల్‌ ఠాగూర్ ను 4కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. 50లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రను 1.8కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. 1 కోటి ధరతో వేలంలోకి వచ్చిన హసరంగను 1.50కోట్లకు సన్ రైజర్స్‌ హైదరాబాద్ దక్కించుకుంది. 2కోట్లతో వేలంలోకి వచ్చిన ఆసీస్ టాప్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను 6.80కోట్లకు సన్ రైజర్స్ హైద్రాబాద్ సొంతం చేసుకుంది. రెండు కోట్ల కనీస ధర ఉన్న ఇంగ్లాండ్ ఆటగాడు హర్రీబ్రూక్స్‌ను ఢిల్లీ కేపిటల్ 4కోట్లతో దక్కించుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 14కోట్లకు కొనుగోలు చేసింది. 2కోట్ల బేస్ ప్రైజ్‌తో ఉన్న దక్షిణాప్రికా బ్యాటర్ రిలీ రొసోవ్‌ను 8కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.

1కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చిన వెస్టిండిస్ ఆల్ రౌండర్ రోమన్ పావెల్‌ను 7.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. 2కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఉమేశ్ యాదవ్‌ను 5.8కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. పేసర్ జయదేవ్ ఉన్కదత్‌ను 1.6కోట్లకు సన్‌రైజర్స్ హైద్రాబాద్ సొంతం చేసుకుంది .శ్రీలంక ఆటగాడు మధుశంకను ముంబాయి ఇండియన్స్ 4.6కోట్లకు కొనుగోలు చేసింది. ఆన్‌క్యాప్డ్ ప్లేయర్లలో 50లక్షల కనీస ధర ఉన్న పేసర్ శివమ్‌ మావిని 6.4కోట్లకు లోక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అలాగే 20లక్షలతో వేలంలోకి వచ్చిన శుభమ్ దూబేను రాజస్థాన్ రాయల్స్ 5.8కోట్లకు కొనుగోలు చేసింది.


అదే కనీస ధరతో ఉన్న సమీర్ రిజ్వీన్ చెన్నై సూపర్ కింగ్స్ 8.4కోట్లకు కొనుగోలు చేసింది. 20లక్షల బేస్‌ప్రైజ్ దేశవాళీ ఆటగాడు సిద్ధార్థ్ మణిమరన్‌ను 2.4కోట్లకు లక్నోసూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. సుశాంత్ మిశ్రాను 2.20కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయిట్జీని 5కోట్లకు ముంబాయి సొంతం చేసుకుంది. 40లక్షల బేస్ ప్రైజ్‌ హిట్టర్ షారుఖ్‌ఖాన్‌ను గుజరాత్ టైటాన్స్ 7.4కోట్లకు కొనుగోలు చేసింది. 20లక్షలతో వేలంలోకి వచ్చిన భారత ఆటగాడు కుమార్ కుశాగ్రాకు ఢిల్లీ కేపిటల్ 7.20కోట్లకు కొనుగోలు చేసింది. యశ్ దయాల్‌ను 5కోట్లకు బెంగుళూర్ కొనుగోలు చేసింది. ఆసీస్ ఆటగాడు ఆస్టన్ ఆగర్‌ను 1కోటికి లక్నో కొనుగలు చేయగా, రూథర్ ఫోర్డును 1.5కోట్లకు కోల్‌కత్తా దక్కించుకుంది.


టామ్ కరన్‌ను 1.5కోట్లకు బెంగుళూర్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండు ఆటగాడు డెవిడ్ విల్లేకు 2కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. ఆసీస్ స్పిన్నర్‌ స్పెన్సర్ జాన్సన్ 10కోట్లకు, రిచర్డ్‌సన్‌ను 5కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. శ్రీలంక ఆటగాడు నువాన్ తుషార్‌ను 4.80కోట్లకు ముంబాయి సొంతం చేసుకుంది. ఆన్‌క్యాప్‌డ్ రాబిన్ మింజ్‌ను 3.60కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. మనీశ్ పాండేను 50లక్షలకు కోల్‌కత్తా కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ పేస్ లాకీ పెర్గూసన్‌ను 2కోట్లకు బెంగుళూరు, ముజీవ్ రహ్మన్‌ను 2కోట్లకు కోల్‌కతా, మహ్మద్ అర్షద్ ఖాన్‌ను 20లక్షలకు లక్నో సొంతం చేసుకుంది. ఆఫ్గాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీని 1.5కోట్లకు ముంబాయి , షైహోప్‌ను 75లక్షలకు డిల్లీ కెపిటల్ కొనుగోలు చేసింది.


50 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్న ఆప్గాన్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ని అదే ధరకు గుజరాత్ కొనుగోలు చేసింది. భారత్ వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ను కనీస ధర 50లక్షలకే కోల్‌కత్తా దక్కించుకుంది. చెతన్ సకారియాను కూడా అదే ధరకు కొల్‌కత్తా సొంతం చేసుకుంది. ట్రిస్టన్ స్టబ్స్‌ను కూడా డిల్లీ కేపిటల్ 50లక్షలకు సొంతం చేసుకుంది. అర్షిన్ కులకర్ణిని 20లక్షలకు లక్నో కొనుగోలు చేసింది. రికీభూయ్‌ని 20లక్షలకు ఢిల్లీ కేపిటల్ , రమణదీప్‌సింగ్‌ను 20లక్షలకు కొల్‌కత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.


ఇంగ్లాండ్ ఆటగాడు టామ్ కోహ్లర్ కాడ్మోర్‌ని కనీస ధర 40లక్షలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆకాశ్‌సింగ్‌ను 20లక్షలకు హైద్రాబాద్‌, కార్తీక్ త్యాగీని 60లక్షలకు గుజరాత్‌, రక్షిక్‌దార్‌ను 20లక్షలకు ఢిల్లీ, శ్రేయస్ గోపాల్‌ను 20లక్షలకు ముంబాయి ఇండియన్స్‌, మన్వర్ సుతార్‌ను 20లక్షలకు గుజరాత్ కొనుకోలు చేసింది. పంజాబ్ కింగ్స్ 20లక్షల చొప్పున అషుతోష్‌శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌, శశాంక్ సింగ్‌, తనయ్ త్యాగరాజన్‌లను కొనుగోలు చేసింది. ప్రిన్స్ చౌదరిని 20లక్షలకు పంజాబ్ కింగ్స్‌, సుబ్రమణ్యన్‌ను 20లక్షలకు హైద్రాబాద్ దక్కించుకుంది.


ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో ఫిలిప్ సాల్ట్‌, ఒడియన్ స్మిత్‌, వాండర్ డసెన్‌, జెమ్స్ నిషామ్‌, కిమో పాల్‌, మ్యాట్ హెన్రీ, కేల్ జేమిసన్‌, బెన్ డ్వారిషూస్‌, షై హోప్‌, దుష్మంత చమీరా, మైకేల్ బ్రాస్‌వెల్‌, ముస్తాఫిజర్ రెహ్మన్‌లతో పాటు భారత ఆటగాళ్లు కరణ్ నాయర్‌, సందీప్ వారియర్‌, లూక్‌వుడ్‌, స్వస్తిక్ చిక్కా, రితిక్ ఈశ్వరన్‌, హిమ్మత్ సింగ్‌, సుమిత్ విర్మలను, సర్పరాజ్‌ఖాన్‌, వివ్రాంత్ శర్మ, అజితేశ్‌, గౌరవ్ చౌదరీ, అతిత్ షేత్‌, హృతిక్ షోకీన్‌, అర్షద్‌ఖాన్‌, అగద్ బవాలను, మురగన్ అశ్విన్‌, పులకిత్ నారంగ్‌, బిపిన్ సౌరబ్‌, కేఎం అసిఫ్‌, షకీబ్ హుస్సెన్‌, మహ్మద్ కైఫ్‌, అభిలాష్ శేట్టి, గుర్జప్ సింగ్‌, పృథ్వీరాజ్ యర్రా, శుభమ్ అగర్వాల్‌ లను ఎవరు కొనుగోలు చేయలేదు. దక్షిణాఫ్రికా పేసర్ నాండ్రి బర్గర్ ను 50లక్షలతో రాజస్థాన్ రాయల్స్, స్వస్తిక్ చికారకు 20లక్షలతో ఢిల్లీ, అబిద్ ముస్తాక్ ను 20లక్షలతో రాజస్థాన్, శివలిక్ శర్మను 20లక్షలతో ముంబాయి, స్వప్పిల్ సింగ్ ను 20లక్ష లతో బెంగుళూరు, అవనిష్ రావును చెన్నై 20లక్షలతో, షకీబ్ హుస్సేన్ ను 20లక్ష లతో కోల్ కత కొనుగోలు చేశాయి. దీంతో వేలం ముగిసింది.



 





తొలిసారిగా వేలం నిర్వాహకురాలిగా మహిళ

పురుషుల ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ వేలం ప్రక్రియను నిర్వహించింది. మహిళా ఐపీఎల్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి ఆకట్టుకున్న మల్లికాసాగర్ ఈ దఫా పురుషుల ఐపీఎల్ మినీ వేలం పాటను నిర్వహించడం అందరిని ఆకట్టుకున్నారు.