India vs Pakistan | పాకిస్తాన్ బహిష్కరించినా.. శ్రీలంకకు భారత్ వెళ్లాల్సిందే!

భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరించినా శ్రీలంకకు టీమిండియా వెళ్లాల్సిందే. ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్‌కు వాకోవర్‌తో 2 పాయింట్లు దక్కే అవకాశం.

Reported by: Tejaswini Nanna | క్రీడలు | Feb 03, 2026, 3:44 pm IST
Read Time: 4 mins
India vs Pakistan | పాకిస్తాన్ బహిష్కరించినా.. శ్రీలంకకు భారత్ వెళ్లాల్సిందే!

విధాత : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో తటస్థ వేదికపై ఈ నెల 15న భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్‌ ఆడాల్సిఉంది. ఎటువంటి కారణం చూపకుండా.. తాము టీమ్ఇండియాతో మ్యాచ్‌ ఆడబోమంటూ పాక్ బోర్డు ప్రకటించింది. భారత్‌తో ఆడాల్సిన ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. వరల్డ్ కప్ మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరించినా భారత్ మాత్రం శ్రీలంకకు వెళ్లాల్సి ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ కోసం మైదానంలోకి దిగాలని, పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా రాకపోతే రిఫరీ భారత్‌కు వాకోవర్ ప్రకటించి 2 పాయింట్లు కేటాయిస్తారు అని అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ భారత్ కూడా మైదానంలోకి వెళ్లకపోతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ఓ జట్టు మైదానంలోకి రాకపోతే ప్రత్యర్థిని విజేతగా ప్రకటించడమే వాకోవర్ విధానం. పాకిస్తాన్ ఈ టోర్నీలో తొలి భాగంలో భారత్ తో మ్యాచ్ ను బహిష్కరించినప్పటికి.. ఇదే టోర్నీలో మళ్లీ నాకౌట్లో భారత్‌తో తలపడాల్సివస్తే ఆ జట్టు ఏం చేస్తుందన్నది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

ఐసీసీకి రూ.2,200కోట్ల నష్టం

ఐసీసీ ఈవెంట్లో భారత్, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ద్వారా దాదాపు రూ.2200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు ఉననాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్‌ బహిష్కరించడంతో ఐసీసీకి ఈ మేరకు భారీ నష్టం వాటిల్లనుంది. అటు భారత్, పాక్‌ మ్యాచ్‌ జరగకపోతే ప్రసారదారు జియోస్టార్‌ రూ.200-250 కోట్ల నష్టపోతుందని అంచనా.

ఇవి కూడా చదవండి :

Gold, Silver price fall| పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధర.. ఇప్పుడు కొనవచ్చా ?
Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్