WTC Points Table|బంగ్లా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. పాయింట్ల పట్టిక ఇప్పుడు ఎలా ఉందంటే..!
WTC Points Table| పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇటీవల పలు విమర్శలు ఎదుర్కొంటుంది. చిన్న చిన్న జట్లపై కూడా ఓడిపోతూ అందరిచే దారుణమైన విమర్శలు మూటగట్టుకుంటుంది. తాజాగా పాకిస్థాన్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ చేతిలో తొలిసారి ఓటమి చవిచూసింది. ఈ క్ర

WTC Points Table| పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇటీవల పలు విమర్శలు ఎదుర్కొంటుంది. చిన్న చిన్న జట్లపై కూడా ఓడిపోతూ అందరిచే దారుణమైన విమర్శలు మూటగట్టుకుంటుంది. తాజాగా పాకిస్థాన్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ చేతిలో తొలిసారి ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ తమ పేరిట చెత్త రికార్డు నమోదుచేసింది. సొంతగడ్డపై టెస్టుల్లో పది వికెట్ల తేడాతో తొలిసారి ఓటమిపాలు కావడంతో పాటు స్వదేశంలో పాకిస్థాన్ జట్టు సుదీర్ఘ ఫార్మాట్‌లో గెలుపు రుచి చూడక ఇప్పటికీ 1294 రోజులు కావడం గమనర్హం. 2021లో సొంతగడ్డపై సౌతాఫ్రికాపై సాధించిన విజయమే ఆఖరిది.
అయితే ఈ మ్యాచ్ తర్వాత ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) పాయింట్ల పట్టికలో బంగ్లా పైకి వెళ్లగా.. పాకిస్థాన్ మరింత దిగజారింది. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఆరో ప్లేస్‍కు ఎగబాకింది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‍లో బంగ్లాదేశ్ 5 టెస్టుల్లో 2 గెలిచి.. మూడు ఓడింది. 24 పాయింట్లు, 40 శాతంతో ఆరో స్థానంలో ఉంది. పాకిస్తాన్ జట్టు అయితే ఎనిమిదో స్థానానికి పడిపోయింది. మొత్తం ఈ పట్టికలో తొమ్మిది జట్లు ఉండగా, చివరి స్థానంలో వెస్టిండీస్ ఉంది. దానిపైన పాక్ నిలిచింది. ఇక ఈ సైకిల్‌లో పాకిస్తాన్ ఇప్పటి వరకు 6 టెస్టుల్లో 2 గెలిచి నాలుగు ఓడింది. 22 పాయింట్లు, 30.56 శాతంతో 8వ స్థానానికి పడిపోయింది.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక చూస్తే ప్రస్తుతం భారత్ టాప్‌లో ఉంది.. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍లు ఆడిన టీమిండియా 6 టెస్టుల్లో గెలవగా, రెండింట ఓటమి, ఓ మ్యాచ్ డ్రా అయింది. దీంతో 74 పాయింట్లు, 68.51 శాతంతో టాప్ ప్లేస్‍లో భారత్ ఉంది. ఆస్ట్రేలియా (62.50 శాతం, 90 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది. ఇక న్యూజిలాండ్ (50శాతం) మూడో ప్లేస్‍లో ఉండగా.. ఇంగ్లండ్ (41.07 శాతం) నాలుగో ప్లేస్‍లో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్ ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది ప్లేస్‍ల్లో నిలిచాయి. చూస్తుంటే మరోసారి భారత్, ఆస్ట్రేలియాల మధ్యనే డబ్ల్యూటీసీ ఫైనల్ జరగబోతున్నట్టు అర్ధమవుతుంది.