Antim Panghal | వివాదంలో యువ రెజ్లర్ అంతిమ్ పంగల్..! పారిస్ నుంచి బహిష్కరించే ఛాన్స్..?
Antim Panghal | రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై అర్హత వేటుతో భారత్ ఒలింపిక్ పతకాన్ని కోల్పోయింది. తాజాగా మరో యువ రెజ్లర్ అంతిమ్ పంగల్‌లో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. పారిస్ ఒలింపిక్స్ మహిళల 53 కిలోల రెజ్లింగ్‌లో అంతిమ్ పంగల్ పోటీపడింది.

Antim Panghal | రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై అర్హత వేటుతో భారత్ ఒలింపిక్ పతకాన్ని కోల్పోయింది. తాజాగా మరో యువ రెజ్లర్ అంతిమ్ పంగల్‌లో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. పారిస్ ఒలింపిక్స్ మహిళల 53 కిలోల రెజ్లింగ్‌లో అంతిమ్ పంగల్ పోటీపడింది. ఇంతకు ముందు వినేశ్ ఫోగట్ సైతం ఇదే కేటగిరిలో పోటీపడింది. అంతిమ్ వివాదంలో చిక్కుకోవడం సర్వత్రా చర్చనీయాంవంగా మారింది. ఈ రెజ్లర్, ఆమె సోదరిని పారిస్ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. స్పోర్ట్స్ విలేజ్ నుంచి తన వ్యక్తిగత వస్తువులను తీసుకువచ్చేందుకు అంతిమ్ పంగల్ తన అధికారిక అక్రిడిటేషన్ కార్డును తన సోదరి నిశాకు అందజేసింది. ఆమె భద్రతా సిబ్బందికి పట్టుబడింది. ఈ పరిస్థితుల్లో ఫ్రెంచ్ అధికారులు ఆమె క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఈ విషయంపై భారత ఒలింపిక్ సంఘం దృష్టి సారించింది. రెజ్లర్‌తో పాటు ఆమె సోదరి, సహాయక సిబ్బందిని తిరిగా భారత్‌కు పంపాలని నిర్ణయించారు.
వాస్తవానికి అంతిమ్ మహిళల 53 కిలోల ఈవెంట్‌లో తన మొదటి బౌట్‌లోని ఓడిపోవడంతో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఆమెకు కేంద్రం నియమించిన కోచ్ భగత్ సింగ్, వ్యక్తిగత కోచ్ వికాస్‌తో కలిసి బస చేసిన హోటల్‌కు వెళ్లింది. అయితే, అంతిమ్ తన సోదరిని గేమ్స్ విజేల్‌కి వెళ్లి లగేజీని తీసుకురావాలని చెప్పింది. సోదరి గేమ్స్ విజేల్‌లోకి వెళ్లి వస్తున్న సమయంలో భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు వారందరినీ స్టేషన్‌కు తరలించారు.
19 ఏళ్ల జూనియర్ ప్రపంచ ఛాంపియన్ అంతిమ్ పంగల్‌ను సైతం స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు పిలిచారు. అయితే, అంతిమ్ కోచ్‌లు వికాస్, భగత్ తగిన మైకంలో కారులో ప్రయాణించారని.. ఛార్జీలు చెల్లించేందుకు నిరాకరించినట్లుగా డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాన్ని చక్కదిద్దేందుకు ఐఓఏ బిజీగా ఉందని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఉన్నాయని.. భద్రతా సిబ్బందితో తమ అధికారులు పరిస్థితిపై చర్చిస్తున్నారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు అంతిమ్ పంగల్ అక్రిడిటేషన్‌ను అధికారులు రద్దు చేశారు. ఇదిలా ఉండగా.. అంతిమ్ ఒలింపిక్స్‌లో టర్కీకి చెందిన యెట్గిల్ జైనెప్‌తో 10-0 తేడాతో పరాజయం పాలైంది. క్వార్టర్ ఫైనల్స్‌లో జర్మనీకి చెందిన అన్నీకా వెండ్ల్ చేతిలో జైనెప్ ఓడిపోవడంతో, ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన 19 ఏళ్ల అంతిమ్ పంగల్.. రెపెచేజ్ ద్వారా కాంస్య పతకానికి రేసులో నిలవాలని భావించగా.. ఆ ఆశలు సైతం అడియాశలయ్యాయి.