India New Zealand 2nd ODI| రాజ్ కోట్ వన్డేలో న్యూజిలాండ్ టార్గెట్ 285

న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ (112*; 92 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) తో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Reported by: Y.V. Narsimha Reddy | క్రీడలు | Jan 14, 2026, 5:35 pm IST
Read Time: 2 mins
India New Zealand 2nd ODI| రాజ్ కోట్ వన్డేలో న్యూజిలాండ్ టార్గెట్ 285

విధాత : న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ (112*; 92 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) తో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56; 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా రెండో అర్ధ శతకం చేశాడు.

శ్రేయస్ అయ్యర్ (8) నిరాశపర్చగా.. రోహిత్ శర్మ (24), విరాట్ కోహ్లీ (23), రవీంద్ర జడేజా (27), నితీశ్‌ రెడ్డి (20) పరుగులు చేశారు. మహ్మద్ సిరాజ్(2) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమీసన్, ఫౌక్స్, జేడెన్‌ లెనాక్స్‌, మైకేల్ బ్రాస్‌వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.