Shoaib Malik | ఇక మా దేశం తరఫున ఆడను.. లీగ్‌లను ఎంజాయ్ చేస్తా.. పాక్ క్రికెటర్ షాకింగ్ డెసిషన్..!
Shoaib Malik | ఇప్పటికే వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి చెందిన సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Shoaib Malik : ఇప్పటికే వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి చెందిన సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టెస్టుల నుంచి తప్పుకున్న ఈ స్టార్ ప్లేయర్.. తాజాగా టీ20 ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు. ఇక మీదట చచ్చినా పాకిస్థాన్‌కు ఆడనని స్పష్టం చేశాడు.
ఇంతటితో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిందని, ఇన్నాళ్లు ఆడినందుకు ఎంతో సంతృప్తిగా ఉందని మాలిక్ తెలిపాడు. ఇక మీదట పాకిస్థాన్‌కు ఆడాలనే కోరిక, ఆసక్తి తనకు లేవన్నాడు. ‘ఇన్నేళ్లపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినందుకు నేను హ్యాపీ. పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాలనే ఇంట్రెస్ట్ పోయింది. నేను ఆల్రెడీ రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యా. ఇప్పుడు మిగిలిన టీ20 క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెబుతున్నా’ అని షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు.
‘ఇకపై నాకు అవకాశం దొరికిన ప్రతి లీగ్‌లోనూ అదరగొట్టేందుకు ప్రయత్నిస్తా’ అని మాలిక్ స్పష్టంచేశాడు. పాక్ టీ20 జట్టు ఎంపికకు తనను పరిగణనలోకి తీసుకోవద్దని ఆ దేశ సెలెక్టర్లకు సూచించాడు. లీగ్ మ్యాచ్‌లలో ఆడుతూ తన గేమ్‌ను ఎంజాయ్ చేస్తానని పేర్కొన్నాడు ఈ సీనియర్ బ్యాటర్. ఇక 2001లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మాలిక్ ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చాడు. షోయబ్ మాలిక్ రిటైర్మెంట్ వార్త ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.