భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు రజతపతకం

విధాత:టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజతపతకం సాధించింది.49 కిలోల వెయిట్ లిప్టింగ్ ఈవెంటులో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. భారతదేశం తరఫున ఒలింపిక్స్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి తర్వాత మీరాబాయి రెండవ వెయిట్ లిఫ్టర్.మీరాబాయి 84, 87 కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగులో విజయవంతం అయ్యారు. చైనాకు చెందిన హు జిహు 94 కిలోల బరువు ఎత్తి […]

  • By: Venkat |    sports |    Published on : Jul 24, 2021 6:59 AM IST
భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు రజతపతకం

విధాత:టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజతపతకం సాధించింది.49 కిలోల వెయిట్ లిప్టింగ్ ఈవెంటులో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. భారతదేశం తరఫున ఒలింపిక్స్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి తర్వాత మీరాబాయి రెండవ వెయిట్ లిఫ్టర్.మీరాబాయి 84, 87 కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగులో విజయవంతం అయ్యారు. చైనాకు చెందిన హు జిహు 94 కిలోల బరువు ఎత్తి ఒలింపిక్ రికార్డు సృష్టించారు. ఐదేళ్ల క్రితం మీరాబాయి రియో ఒలింపిక్స్ లో పాల్గొని పేలవమైన ప్రదర్శన ఇచ్చినా, ఆ తర్వాత పుంజుకొని టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి భారత్ కు బోణి కొట్టారు.