Women’s Cricket Asia Cup 2024 Finals | ఈసారి ఆసియాకప్ విజేత శ్రీలంక
శ్రీలంక తొలిసారి మహిళల ఆసియా కప్‌ను ముద్దాడింది. అది కూడా ఫైనల్లో భారత్‌పై గెలిచి గత ఆసియాకప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

దంబుల్లాలో జరిగిన మహిళల ఆసియా కప్ క్రికెట్ ఫైనల్స్(Women’s Cricket Asia Cup 2024 Finals )లో శ్రీలంక(Sri Lanks win over India) భారత్‌పై ఘనవిజయం సాధించి తొలిసారి(First ever Asia Cup) ఆసియా కప్‌ను ఎత్తుకుంది. గత ఆసియా కప్(2022) ఫైనల్స్‌లో భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన శ్రీలంక ఇప్పుడు తిరుగులేని ప్రతీకారం తీర్చుకుంది. శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు(Chamari Athapaththu) పట్టుదల ముందు భారత్ ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది(India: 165/7 in 20 Overs). ప్రతిగా శ్రీలంక 2 వికెట్లు నష్టపోయి 18.4 ఓవర్లకు 167 పరుగులు చేసి విజయం సాధించింది(Sri Lanka: 167/2 in 18.4 Overs). అయిదు సార్లు ఫైనల్లో ఊరించి దక్కకుండా పోయిన కప్పు ఈసారి ఓళ్లో వాలడంతో శ్రీలంక ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఈ ఐదు సార్లు శ్రీలంక ఇండియా చేతిలోనే ఓడిపోవడం గమనార్హం(Sri Lanka Five times Runner-up).
బ్యాటింగ్‌కు దిగిన ఇండియా, పరుగులు సాధించడానికి ఒకింత ఇబ్బందిపడింది. లేడీ సెహ్వాగ్‌గా పేరుగాంచిన షపాలీవర్మ బ్యాటింగ్‌లో తడబడి 16 పరుగులకే పెవిలయన్ చేరింది. మరోపక్క స్మృతి బెదరకుండా తనదైన శైలిలో విరుచుకుపడి, పరుగులు రాబట్టింది. పవర్‌ప్లేలో 44 పరుగులు మాత్రమే రాబట్టిన ఇండియా, 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఉమా చెత్రీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌లు తక్కువ స్కోరుకే అవుట్ కాగా, మళ్లీ జెమీమా రోడ్రిగ్స్(29), రిచా ఘోష్(30) పోరాడి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించారు. తుదకు నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (Smriti Madhana)47 బంతుల్లో 10 ఫోర్లతో 60 పరుగులు సాధించి వరుసగా రెండో అర్థసెంచరీ చేయడం గమనార్హం.
ఎలాగైన ఈసారి కప్ కొట్టాలని కసితో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక బ్యాటర్లకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ విశ్మి గుణరత్నే 7 పరుగులకే రనౌట్ అయింది. కానీ, పట్టుదలకు మారుపేరైన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు గట్టిగా నిర్ణయించుకున్నట్లు ధాటిగా ఆడింది. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ లాగే 44 పరుగులు చేసిన లంకేయులు, 10 ఓవర్లకు మాత్రం అదే ఒక వికెట్‌కు 80 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి విధ్వంసానికి హర్షిత సమరవిక్రమ(Harshitha Samarawickrama) సుడిగాలి బ్యాటింగ్ తోడై, లక్ష్యాన్ని ఉఫ్‌మంటూ ఊదేసారు. గమ్యం చేతుల్లోకి వచ్చాక, చమరి(43 బంతుల్లో 61 పరుగులు: 2 సిక్స్‌లు, 9 ఫోర్లు) అవుటయినా, మిగిలిన లాంఛనాన్ని దిల్హరి తోడుతో హర్షిత(51 బంతుల్లో 69: 2 సిక్స్‌లు, 5 ఫోర్లు) విజయవంతంగా పూర్తిచేసి, శ్రీలంకకు తొలి ఆసియాకప్‌ను అందించింది. శ్రీలంక ఏ దశలోనూ ఒత్తిడికి లోను కాలేదు. ఆ బాధ్యత ఇండియా బౌలర్లు, ఫీల్డర్లు తీసుకున్నారు. పస లేని బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌తో శ్రీలంకకు అదనపు బ్యాటర్లుగా నిలిచారు.
2004లో ప్రారంభమైన మహిళల ఆసియా కప్, నాలుగుసార్లు వన్డే ఫార్మాట్లో సాగగా, అయిదుసార్లు టి20 ఫార్మాట్లో నడిచింది. మొత్తం తొమ్మిదిసార్లు ఈ పోటీలు జరగగా, అత్యధికంగా ఏడుసార్లు భారత్ విజేతగా నిలిచింది. 2018లో బంగ్లాదేశ్ గెలవగా, ఇప్పుడు శ్రీలంక గెలిచింది.