విధాత : భారత యువ బ్యాడ్మింటన్ సంచలనం తన్వీ శర్మ చరిత్ర సృష్టించింది. తైపీ బ్యాడ్మింటన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. 17 ఏళ్ల తన్వి శర్మ ఫైనల్ పోరులో వియత్నాంకు చెందిన థుయ్ లిన్‌ను 21-16, 21-16 తేడాతో వరుస సెట్లలో ఓడించి టైటిల్ నెగ్గింది. దీంతో భారత్‌కు 18 ఏళ్ల తర్వాత తైపీ ఓపెన్ టైటిల్‌ను అందించింది. గ
తంలో 2008లో తైపీ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ విజేతగా నిలిచింది. పంజాబ్‌కు చెందిన 17 ఏళ్ల తన్వి మళ్లీ ఇప్పుడు టైటిల్ నెగ్గి..18 ఏళ్ల తర్వాత తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో టైటిల్ గెలిచిన రెండో భారతీయురాలిగా తన్వి నిలిచింది.
తన్వి శర్మకు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 టైటిల్ కావడం విశేషం. తన్వీ గతేడాది యూఎస్ ఓపెన్ సూపర్ 300లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి తైపీ ఓపెన్‌లో మాత్రం ఫైనల్‌ను విజయంగా మలిచి తన తొలి సూపర్ 300 టైటిల్‌ను అందుకుంది.
16 ఏళ్ల వయసులోనే తన తొలి సూపర్ 300 ఫైనల్‌కు(2025 US ఓపెన్) చేరుకున్న తన్వీ.. ఆ తర్వాత ఒడిశా మాస్టర్స్, గువాహటి మాస్టర్స్‌లోనూ రన్నరప్‌గా నిలిచింది. తైపీ ఓపెన్ ఫైనల్‌కు చేరుకునే సమయానికి ఆమె ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-35లోకి దూసుకొచ్చింది. 17 ఏళ్ల 222 రోజుల వయసులో తైపీ ఓపెన్ నెగ్గిన తన్వీ, ఈ టోర్నీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన టైటిల్ విన్నర్‌గా నిలిచింది.తన్వీకి పీవీ సింధు మాజీ కోచ్ పార్క్ టే-సాంగ్ మార్గదర్శకత్వం అందిస్తున్నాడు. దూకుడైన ఆటతీరు, నిలకడతో ఆకట్టుకుంటున్న తన్వీ.. ఈ టైటిల్‌తో భారత బ్యాడ్మింటన్‌లో భవిష్యత్ స్టార్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
