IND vs SL| 27 ఏళ్ల తర్వాత శ్రీలంకపై సిరీస్ ఓడిన టీమిండియా.. ఓటమికి ఇవే ప్రధాన కారణాలు
IND vs SL| టీ20 వరల్డ్ కప్ దక్కించుకొని మంచి జోష్ మీదున్న టీమిండియా తాజాగా లంకతో జరిగిన మూడు వన్డే సిరీస్‌లో దారుణంగా ఓటమి పాలైంది. ఇటీవలి కాలంలో మన జట్టు ఇంత దారుణంగా ఆడడం ఇదే తొలిసారి. ఫస్ట్ మ్యాచ్ డ్రాతో ముగిసిన రెండు, మూడు వన్డేలలో శ్రీలంక గెలిచి చరిత్ర సృష్టించింది. మూడో వన్డేలో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లకి గాను 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. అయితే తొమ్మిదో నంబర్ వరకు బ్యాటింగ్ లైన

IND vs SL| టీ20 వరల్డ్ కప్ దక్కించుకొని మంచి జోష్ మీదున్న టీమిండియా తాజాగా లంకతో జరిగిన మూడు వన్డే సిరీస్‌లో దారుణంగా ఓటమి పాలైంది. ఇటీవలి కాలంలో మన జట్టు ఇంత దారుణంగా ఆడడం ఇదే తొలిసారి. ఫస్ట్ మ్యాచ్ డ్రాతో ముగిసిన రెండు, మూడు వన్డేలలో శ్రీలంక గెలిచి చరిత్ర సృష్టించింది. మూడో వన్డేలో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లకి గాను 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. అయితే తొమ్మిదో నంబర్ వరకు బ్యాటింగ్ లైనపర్ ఉండడంతో ఆ టార్గెట్‌ని భారత్ ఛేజ్ చేయడం ఈజీనే అని అంతా అనుకున్నారు. కానీ లంక స్పిన్నర్ల దెబ్బకు రోహిత్ సేన 138 పరుగులకు చాపచుట్టేసింది.
దీంతో భారత్‌పై శ్రీలంక ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే మెన్ ఇన్ బ్లూ ఓటమికి ఈ మూడు ప్రధాన కారణాలు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప ఎవరూ పెద్దగా రన్స్ చేసింది లేదు. మూడో మ్యాచ్‌లో రోహిత్ మంచి స్టార్ట్ అందించాడు. 20 బంతుల్లో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక శుబ్‌మన్ గిల్ (6), రిషబ్ పంత్ (6), శ్రేయస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ (2), శివమ్ దూబె (9) ఇలా ఎవరు కూడా రెండు అంకెల స్కోరు చేయలేకపోయారు. టెయిలెండర్ వాషింగ్టన్ సుందర్ (30) పోరాడకపోతే భారత్ స్కోరు వంద పరుగులు కూడా దాటేది కాదు.
ఇక ఈ మ్యాచ్‌లో క్వాలిటీ పేసర్ లేకపోవడం. సిరాజ్ పూర్తిగా తేలిపోయాడు.మరోవైపు రాహుల్‌ని కాదని పంత్‌ని తీసుకున్నా అతను హిట్టింగ్ చేయలేక, ఇటు డిఫెన్స్ చేయలేక త్వరగా పెవిలీయన్ చేరాడు. ఇక మూడో వన్డేలో భారత్ ఓటమికి ఇంకో ప్రధాన కారణం కోహ్లీ ఔట్. 20 పరుగులతో మంచి స్టార్ట్ అందుకున్నాక కోహ్లీ వికెట్ సమర్పించుకోవడంతో జట్టు అంతా కొలాప్స్ అయింది. కెప్టెన్ రోహిత్ త్వరగా ఔట్ అవడం కూడా జట్టుకు మైనస్‌గా మారింది. బౌలర్లలో సిరాజ్ వైఫల్యం, బ్యాటర్లలో కోహ్లీ, అయ్యర్, పంత్, గిల్ ఫెయిల్యూర్ భారత్ అపజయానికి ముఖ్యమైన కారణాలుగా చెప్పవచ్చు.