IPL Stars | ఐపీఎల్‌లో స్టార్‌ ప్లేయర్స్‌ కానీ.. టీ20 ప్రపంచకప్‌లో చోటేదీ..?

IPL Stars | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఐదుగురు భారతీయ ఆటగాళ్లు స్టార్‌ ప్లేయర్స్‌ ఉన్నారు. అయితే, క్రికెటర్స్‌కు టీ20 వరల్డ్‌ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. ఐదుగురు ప్లేయర్స్‌కు బెర్తు దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్‌లో ఒక్కో ఆటగాడు రూ.10కోట్లకుపైగానే అందుకుంటుండడం విశేషం. ఐపీఎల్‌లో స్టార్‌ ప్లేయర్స్‌గా కొనసాగుతూ ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం..!

IPL Stars | ఐపీఎల్‌లో స్టార్‌ ప్లేయర్స్‌ కానీ.. టీ20 ప్రపంచకప్‌లో చోటేదీ..?

IPL Stars | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఐదుగురు భారతీయ ఆటగాళ్లు స్టార్‌ ప్లేయర్స్‌ ఉన్నారు. అయితే, క్రికెటర్స్‌కు టీ20 వరల్డ్‌ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. ఐదుగురు ప్లేయర్స్‌కు బెర్తు దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్‌లో ఒక్కో ఆటగాడు రూ.10కోట్లకుపైగానే అందుకుంటుండడం విశేషం. ఐపీఎల్‌లో స్టార్‌ ప్లేయర్స్‌గా కొనసాగుతూ ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం..!

కేఎల్‌ రాహుల్

కేఎల్‌ రాహుల్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) కెప్టెన్‌గా కొనసాగుతున్నాయిడు. ఆ ఫ్రాంచైజీ రాహుల్‌కు రూ.17 కోట్లు చెల్లిస్తున్నది. ఈ స్టార్ ప్లేయ‌ర్‌ 2022 టీ20 వర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే, ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.

శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ కొనసాగుతున్నాడు. కేకేఆర్‌ జట్టు తనికి రూ.12.25కోట్లు చెల్లిస్తున్నది. అయ్యర్‌ 2021, 2022 టీ20 వరల్డ్‌ కప్‌ రిజర్వ్‌ ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కింది. కానీ, ఈ సారి ఆ అవకాశం కూడా లేకపోయింది. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మాత్రం చోటు దక్కించుకున్నాడు.

ఇషాన్ కిషన్

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ఇషాన్‌ కిషన్‌ ఆడుతున్నాడు. ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌.. వికెట్‌ కీపర్‌గానూ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీ అతడికి భారీగానే పారితోషకం ఇస్తున్నది. ఏకంగా రూ.15.25 కోట్లు చెల్లిస్తున్నది. టీమిండియా త‌ర‌ఫున‌ 2021లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఆడాడు. గత సంవత్సరం ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్‌ జట్టులోనూ చోటు దక్కింది. కానీ, ఈ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మాత్రం అతని పట్టించుకోలేదు.

హర్షల్ పటేల్

పంజాబ్‌ కింగ్స్‌ హర్షల్‌ పటేల్‌ స్టార్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్నాయి. దుబాయి వేదికగా జరిగిన మినీ వేలంలో పంజాబ్‌ కింగ్స్ ఫ్రాంచైజీ అతడిని రూ.11.75కోట్లకు దక్కించుకుంది. హ‌ర్షల్ ప‌టేల్ టీ20ల్లో భార‌త్ త‌ర‌ఫున ప్రాతినిథ్యం వహించాడు. 2022లో జ‌రిగిన టీ20 ప్రపంచ‌కప్‌లో కూడా ఆడాడు. ఇటీవల ఫామ్‌లేమికి తోడు గాయాల కారణంగా దూరమయ్యాడు. ప్రస్తుత టీ20 వరల్డ్‌ కప్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు.

దీపక్ చాహర్

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌కు ముందు నిర్వహించిన మినీ వేలంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ దీపక్ చాహర్‌ను రూ.14 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఆ జ‌ట్టులో అధిక జీతం పొందుతున్న వారిలో ఈ మీడియం పేస‌ర్ కూడా ఒక‌డు. నిల‌క‌డ‌లేని బౌలింగ్, ధారా‌ళంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డం తదితర కార‌ణాల‌తో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే పొట్టి ప్రపంచకప్‌కి సైతం దూరమయ్యాడు.

జూన్‌ 2 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌..

ఈ ఏడాది జూన్‌ 2న టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభంకానున్నది. అదే నెల 29న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ సారి వెస్టిండిస్‌తో పాటు అమెరికా సైతం వరల్డ్‌ కప్‌కి ఆతిథ్యం ఇస్తున్నది. ఈ సారి 20 జ‌ట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 55 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. టీమిండియా త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడుతుంది. ఇక జూన్ 9న దాయాది పాకిస్థాన్‌తో, జూన్ 12న అమెరికాతో, 15న కెన‌డాను భార‌త్ ఢీకొట్టనున్నది.

ప్రపంచకప్‌కి భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్‌కు చోటు కల్పించింది. ఇక రిజర్వ్ ఆట‌గాళ్లుగా శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్‌ని ఎంపిక చేసింది.