కాన్పూర్ స్టేడియం స్టాండ్ బలహీనం–పూర్తిగా నిండితే కూలిపోయే అవకాశం
భారత్ – బంగ్లాదేశ్‌ల మధ్య జరగాల్సిన రెండో టెస్ట్ వేదికైన కాన్పూర్ స్టేడియంలోని స్టాండ్స్ నిర్మాణాలు చాలా బలహీనంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కాన్పూర్(Kanpur)లోని గ్రీన్ పార్క్ స్టేడియం(Green Park Stadium). 27 నుండి భారత్ – బంగ్లాదేశ్(India – Bangladesh)ల మధ్య జరగాల్సిన రెండోది, ఆఖరిది అయిన టెస్ట్ మ్యాచ్(2nd Test Match) వేదిక. ఇప్పుడు టెన్షన్ అంతా అక్కడికే చేరుకుంది. ఈ టెస్ట్‌ను కూడా కొట్టేసి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ కసిగా ఉంటే, గెలిచి పరువు నిలుపుకుందామని బంగ్లాల ప్రయత్నం. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, మ్యాచ్ జరగాల్సిన స్టేడియమే భయపెడుతోంది. 2021 తర్వాత జరుగబోయే మొదటి అంతర్జాతీయ మ్యాచ్(first international match after 2021) ఇది. స్టేడియంలోని బాల్కనీ సి స్టాండు (Weak Stand) బలహీనంగా ఉందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రజా పనుల శాఖ(UP PWD) బాంబు పేల్చింది. ఒకవేళ స్టేడియం పూర్తిగా నిండితే నిర్మాణం కూలిపోయే(Collapse) ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
యుపిసిఏ సిఈఓ(UPCA CEO) అంకిత్ చటర్జీ(Ankit Chatterjee) ఈ విషయాన్ని ధృవీకరించారు. పిడబ్ల్యూడి వారు తమకు ఈ సంగతి తెలిపినట్లు, తాము కూడా ఆ స్టాండ్‌లో పూర్తి టికెట్లు అమ్మడం లేదని ఆయన తెలిపారు. మొత్తం 4800 టికెట్లకు గానూ కేవలం 1700 మాత్రమే అమ్మకానికి పెట్టినట్లు చెప్పిన అంకిత్, స్టాండ్ రిపేర్ పనులు ఇంకో రెండు రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజాపనుల శాఖ ఇంజనీర్లు స్టేడియంను అత్యంత నిశితంగా పరిశీలించి ప్రమాదం పొంచిఉందని, ఆ స్టాండ్‌ను వాడకూడదని యుపిసిఏకు తెలియజేసారు.
ఆ స్టాండ్ కనీసం 50 మంది అభిమానులను కూడా తట్టుకోలేదని, ఒకవేళ పంత్ గనుక ఓ సిక్స్ కొడితే(If Pant hits a Six..), వారి గెంతులకు స్టాండ్ కూలిపోవడం ఖాయమని వారు కుండ బద్దలు కొట్టారు. ఓ పక్క యుపిసిఏ ఆ స్టాండ్‌కు సంబంధించిన 1700 టికెట్లు అమ్మాకానికి పెట్టింది.
స్టాండ్ రిపేర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నప్పటికీ, మ్యాచ్ నాటికల్లా పూర్తవకపోతే పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు అందరినీ భయపెడుతోంది.