ఐపీఎల్ – 2026 కప్ గెలుచుకున్న ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో కింగ్ విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ దంపతుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓడించి..ఆర్సీబీ జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. దీంతో ఆర్సీబీ జట్టు ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి మైదానంలో ఐపీఎల్ కప్ చేత పట్టుకుని మురిసిపోతూ..ముద్దులు పెడుతూ.. విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

విజయోత్సవ సంబరాల్లో కింగ్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి గ్రౌండ్ లో చిన్న పిల్లాడిలా కేకలు వేస్తూ..గంతులు వేస్తూ..డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఐపీఎల్ కప్ తో విరుష్క జంట చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే ఆర్సీబీ ఆటగాడు కృనాల్ పాండ్య తన చిన్నారి కొడుకుతో మైదానంలో విజయోత్సవ సంబరాల్లో పూలు చల్లుకుంటు చేసిన సందడి కూడా వైరల్ అయ్యింది.

ఐపీఎల్ యువ సంచనం వైభవ్ సూర్యవంశీ పలు అవార్డులు గెలుచుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బహుమతి ప్రధానోత్సవం సందర్బంగా కోహ్లీని చూసిన వైభవ్ నమస్కారం చేయడం అందరిని ఆకట్టుకుంది. విరాట్‌ను చూడగానే వైభవ్‌ నమస్కరించాడు. దీంతో విరాట్ కోహ్లీ సైతం అతడి భుజాలపై చేతులు వేసి కొన్ని నిమిషాలపాటు మాట్లాడాడు. వారిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందనేది తెలియనప్పటికీ.. సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌గా మారింది.