Zaheer Khan | మరోసారి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న జహీర్‌ ఖాన్‌.. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో చర్చలు..!

Zaheer Khan | టీమిండియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ మరోసారి ఐపీఎల్‌ ఎంట్రీకి ఇవ్వనున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం లక్నో సూపర్‌ జెయింట్స్‌, జహీర్‌ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

Zaheer Khan | మరోసారి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న జహీర్‌ ఖాన్‌.. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో చర్చలు..!

Zaheer Khan | టీమిండియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ మరోసారి ఐపీఎల్‌ ఎంట్రీకి ఇవ్వనున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం లక్నో సూపర్‌ జెయింట్స్‌, జహీర్‌ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ చర్చలు సఫలమైతే గౌతమ్ గంభీర్ స్థానంలో జ‌హీర్ ఖాన్‌ జట్టుకు మెంటార్‌గా మారే అవకాశం ఉన్నది. అంతేకాకుండా జట్టులో బౌలింగ్‌ కోచ్‌గా చూసే అవకాశం ఉన్నది. మోర్నీ మోర్కెల్‌ను టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కోచింగ్‌ స్టాఫ్‌లో ఒక పోస్టు ఖాళీ అయ్యింది. జహీర్‌ టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో మోర్కెల్‌ను టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా నియమిచింది.

ఐపీఎల్‌లో కోచింగ్‌ పని చేసిన అనుభవం జహీర్‌ఖాన్‌కు ఉన్నది. ఢిల్లీకి కోచ్‌గా, కెప్టెన్‌గా వ్యవహరించారు. అలాగే, జ‌హీర్ ఖాన్‌ ముంబయి ఇండియన్స్‌తో సైతం కలిసి పని చేశాడు. జహీర్ భారత్ తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఐపీఎల్‌లో జ‌హీర్ ఖాన్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబయి ఇండియన్స్‌తో కలిసి పని చేశాడు. చివరిసారిగా 2017లో చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడాడు. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. అయితే, అంతకుముందు 2022, 2023లో జట్టు ప్లే ఆఫ్‌కు చేరింది. తొలి టైటిల్‌ని నెగ్గేందుకు ఎదురుచూస్తోంది.