Snakes Bath | పాములకు లాల పోస్తున్న మహిళ.. వీడియో వైరల్!
Snakes Bath | పిల్లలకు తల్లులు స్నానం చేయిస్తుంటారు. చలిగా ఉంటే.. వేణ్ణీళ్లు పెట్టిమరీ లాల పోస్తారు! మరి పాముల సంగతేంటి? సాధారణంగా పాములు ఆడించేవాళ్లు వాటిని తమ పిల్లల్లానే చూసుకుంటారు. ఆ పాములు వాళ్ల ఇళ్లల్లో స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. వాటితో ఆ ఇంటిలోని పిల్లలు సైతం సరదాగా ఆటలాడుతారు.
చిన్న పిల్లలు వాటిని పట్టుకుని కొరకాలని చూసినా.. అవి ఏమాత్రం భయపడవు.. భయపెట్టవు. అవికూడా పిల్లలతో ఆడుతున్నట్టు ఉంటాయి. ఇలాంటి ఒక పాములు ఆడించేవాళ్ల ఇంట్లో కనిపించిన దృశ్యాన్ని ఔత్సాహికులు ఒకరు నెట్టింట పెట్టారు. దానిని చూసి.. నెటిజన్లు తలో విధంగా స్పందిస్తున్నారు.
పాములకు లాల పోస్తున్న మహిళ.. వీడియో వైరల్! #viral #snake #India #VIDEO #viralvideo #Terrorism pic.twitter.com/jzrVNBlaGp
— srk (@srk9484) April 26, 2025
ఆ వీడియోలో ఒక మహిళ ఒక పామును మంచిగా ఒక పాత్రలో ముంచి.. ఒళ్లు రుద్దుతూ ఉంటుంది. నెక్స్ట్ మా వంతేనన్నట్టు మరో రెండు పాములు ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ వీడియోకు ‘ఎంత చలిగా ఉన్నా.. అమ్మ స్నానం చేయించకుండా వదలదు..’ అని క్యాప్షన్ పెట్టారు. దీనిని చూసిన ఒక నెటిజన్.. ఈ పరిస్థితిలో పాములు ఏమునుకుంటున్నాయో వాటి మనసులో ఏమున్నదో సరదాగా కామెంట్ చేశారు.
చిన్నపిల్లలు స్నానం చేయించేటప్పుడు మొరాయిస్తుంటారు చూడండి.. అలాగన్నమాట. ‘మమ్మీ.. అలా చేయకు.. ’, నేను కోబ్రాను.. ఇజ్జత్ పోతున్నది..’ అని ఆయన రాశారు. మరొకాయన.. మాకు సైతం వేణ్ణీలు కావాల్సిందే అన్నట్టు పాములు అనుకుంటున్నాయేమోనని వ్యాఖ్యానించాడు. అయితే.. ఈ వీడియో గత సంవత్సరంది అయినప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో మరోమారు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.
Snake Dens | దాదాపు లక్షన్నర పాములు ‘కలిసే’ అతిపెద్ద ‘పాముల జాతర’ ఎక్కడో తెలుసా?
పాములకు లాల పోస్తున్న మహిళ.. వీడియో వైరల్! #viral #snake #India #VIDEO #viralvideo #Terrorism pic.twitter.com/jzrVNBlaGp
— srk (@srk9484) April 26, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram