Snake in Train | వేగంగా దూసుకుపోతున్న రైలు.. టాయ్‌లెట్‌లో పాము!

Snake in Train | వేగంగా దూసుకుపోతున్న రైలు.. టాయ్‌లెట్‌లో పాము!

Snake in Train | ఇంట్లోనో, ఇంటి ముందు తుప్పల్లోనో పాము కనిపిస్తేనే హడలెత్తి పోతాం. కనీసం తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ.. వేగంగా దూసుకుపోతున్న రైల్లో పాము కనిపిస్తే? అందులోనూ టాయ్‌లెట్‌లో నక్కి ఉంటే? ఇక ఆ రైల్లో ఉన్నవారి ఫీలింగ్స్‌ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి భయానక అనుభవమే డిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నవారికి ఇటీవల ఎదురైంది.

దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు అడవులు, పొలాలు, మైదానాలు, ప్రజల ఆవాస ప్రాంతాల మీదుగా వెళుతూ ఉంటాయి. ప్రయాణం ముగిసిన తర్వాత వాటిని స్టేషన్‌లో ఒక ప్రాంతంలో నిలిపివేస్తారు. అటువంటి సమయాల్లో పాముల వంటి జీవులు రైళ్లలోకి ప్రవేశించే అవకాశాలు లేకపోలేదు. ఈ ఘటనలో కూడా అదే జరిగిందేమో కానీ.. ఒక పాము డిబ్రూగఢ్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఏసీ కోచ్‌లోకి దూరింది. `చక్కగా టాయ్‌లెట్‌లోకి వెళ్లిపోయింది. కదులుతున్న ఆ ట్రైన్‌లోని టాయ్‌లెట్‌ ఫ్యాన్‌కు పాము చుట్టుకొని ఉండటాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రైలు సిబ్బందిలో ఒకరు సురక్షితంగా ఆ పామును పట్టుకుని, కదులుతున్న ట్రైన్‌లోనుంచే బయటకు విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియోను అదే రైల్లో ప్రయాణిస్తున్న ఒక జర్నలిస్టు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. దానికి నెటిజన్లు ఒక్కొక్కళ్లు ఒక్కోలా స్పందించారు. అసలు ఆ పాము రైలు ఎలా ఎక్కిందనే సందేహాలను కొందరు వ్యక్తం చేశారు.

ఈ ఘటన మే 4వ తేదీన డిబ్రూగఢ్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ 12424లో ఫలకట వద్ద జరిగినట్టు చెబుతున్నారు. మే 3వ తేదీన రైలు న్యూఢిల్లీ నుంచి బయల్దేరింది. ఒక ప్రయాణికుడు టాయ్‌లెట్‌ను ఉపయోగించే క్రమంలో ఫ్యానుకు పాము చుట్టుకొని ఉన్న సంగతిని గుర్తించి, సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే అక్కడికి వచ్చిన సిబ్బంది.. ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్‌తో చాకచక్యంగా ఆ పామును పట్టుకొని.. జాగ్రత్తగా గేట్‌ వరకూ వచ్చి.. అక్కడి నుంచి దానిని బయటకు విసిరేశాడు. సాహసంతో పామును పట్టుకొని బయట పడేసిన సిబ్బందిని పలువురు అభినందించారు.

ఇవి కూడా చదవండి..

Smart Ration cards | తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇంకెప్పుడు? అప్ డేట్ ఏమిటి?
Pulwama attack | పుల్వామా ఉగ్రదాడిలో తమ ప్రమేయం ఉందన్న ఔరంగజేబ్
IAS Srilakshmi | ఒక్క ప‌దం తొల‌గించినందుకు నిత్య న‌ర‌కం.. ఐఏఎస్‌లకు ఈమె కేసు పెద్ద‌ గుణ‌పాఠం!

ఎక్కువమంది చదివిన వార్తలు

IAS Srilakshmi | ఒక్క ప‌దం తొల‌గించినందుకు నిత్య న‌ర‌కం.. ఐఏఎస్‌లకు ఈమె కేసు పెద్ద‌ గుణ‌పాఠం!
Southwest Monsoon | ముందుగానే నైరుతి రుతుపవనాల రాక! కేరళ తీరానికి ఎప్పుడంటే..
Global Warming | గ్లోబల్‌ వార్మింగ్‌తో విస్తరించే ప్రాణాంతక ఫంగస్‌! 33 శాతానికిపైగా మరణాల రేటు!
Climate change | మరో పదిహేనేళ్లలోనే ఆ సిటీల్లో జీవనం అసాధ్యం! ఇండియాలో ఆ సిటీలు కూడా?