AI Phone Tapping | ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేయనున్న ఏఐ!
ఏఐ టెక్నాలజీతో ఫోన్ ట్యాపింగ్ కొత్త దశలోకి! కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో సంభాషణలు టెక్స్ట్‌గా మారే సాంకేతికత ఆందోళన రేపుతోంది.

AI Phone Tapping | విధాత : ఫోన్ ట్యాపింగ్..స్పైవేర్, పెగానస్ వంటి సాఫ్ట్ వేర్ లతో సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియకు కొత్తగా ఏఐ తోడయ్యే పరిస్థితి ఆందోళన రేపుతుంది. కొత్తగా పరిశోధన వేత్తలు ఫోన్ లో మాట్లాడే క్రమంలో ఫోన్ ఇయర్‌పీస్ నుండి వచ్చే వాయిస్ శబ్ధాలను.. చిన్న వైబ్రేషన్‌లను తీసుకొని వాటిని పదాలుగా మార్చగలిగే ఏఐ సాంకేతికత ప్రయోగాలను విజయవంతం చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో రానున్న రోజుల్లో ప్రైవేట్ చాట్స్ ఎంత సురక్షితమన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
పెన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఫోన్ స్పీకర్ నుండి వచ్చే శబ్దం వల్ల కలిగే మైక్రో వైబ్రేషన్స్ గుర్తించడానికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, 5జీలో ఉపయోగించే అదే టెక్నాలజీతో మిల్లీమీటర్-వేవ్ రాడార్‌ను ఉపయోగించారు. ఈ వైబ్రేషన్స్ ని ఏఐ టెక్స్ట్‌గా మార్చింది. ఈ పరీక్షలలో వారు 3 మీటర్ల దూరం నుండి దాదాపు 60% సంభాషణలను ఖచ్చితంగా సంగ్రహించగలిగారు. ఇందుకు ఫోన్‌ను హ్యాక్ చేయడం లేదా స్పైవేర్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదట. ఇది పూర్తిగా కాంటాక్ట్‌లెస్ ప్రక్రియ. ఈ ఫోన్ ట్యాపింగ్ ను కనిపెట్టడం కూడా కష్టమంటున్నారు.
ఒకవేళ దీనిని దుర్వినియోగం చేస్తే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. సున్నితమైన సమాచారం భవిష్యత్తులో దీంతో లీక్ అయ్యే ప్రమాదం ఉంది.ప్రస్తుతం ఇది కొన్ని పరిమితులతో కూడిన ప్రయోగదశలో ఉన్నప్పటికి మునుముందు ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఫోన్ వినియోగం సవాల్ తో కూడకోనుంది.
ఇవి కూడా చదవండి…
“కూలీ” సమీక్ష – రజినీకాంత్ స్టైల్, నాగార్జున విలనిజం, లోకేష్ మాస్ ట్రీట్ – ఎలా ఉంది?
దుస్సాహసానికి తెగిస్తే బాధాకర పర్యవసానాలే! : పాకిస్తాన్‌కు భారత్ సీరియస్ వార్నింగ్