iOS 26 | ఐఫోన్​ కొత్త ఆపరేటింగ్​ వ్యవస్థ ఐఓఎస్​26 విడుదల. లిస్ట్​లో మీ ఐఫోన్​ ఉందా? ఎలా అప్​డేట్​ చేసుకోవాలి?

ఆపిల్ కొత్త ఓఎస్​ iOS 26 కొద్దిసేపటి క్రితం విడుదలైంది. దీంతో పాటు  మ్యాక్​ఓఎస్​ తాహో , ఐప్యాడ్​ఓఎస్​ 26, వాచ్​ఓఎస్​ 26 కూడా అప్​డేట్​కు అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్​ 17తో పాటు 2019 తర్వాత వచ్చిన అన్ని ఐఫోన్లకు ఈ iOS 26  అప్‌డేట్ అందుతుంది.

  • Publish Date - September 15, 2025 / 11:02 PM IST

Screenshot

  • మ్యాక్​కు మ్యాక్​ఓఎస్​ తాహో(MacOS Tahoe)
  • ఐప్యాడ్​ కోసం ఐప్యాడ్​ఓఎస్​ 26 (iPadOS 26)
  • ఆపిల్​ వాచ్​కు వాచ్​ఓఎస్​ 26 (WatchOS 26)
  • అన్నీ అప్​డేట్​కు అందుబాటులో నేటి నుండి (September 15, 10.30 pm IST)

నేడు విడుదలైన iOS 26 – పూర్తి వివరాలు, అప్‌డేట్ చేసుకోగలిగే ఐఫోన్ల జాబితా, కొత్త ఫీచర్లు

iOS 26 with new Liquid Glass UI interface on iPhone screen

iOS 26 విడుదల – ఎప్పుడు, ఎవరికి?

ఆపిల్ తన ‘Awe Dropping’ ఈవెంట్ 2025లో కొత్త ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ 17 ఎయిర్ మోడళ్లను ఆవిష్కరించింది. వీటిలో తాజా iOS 26 ముందుగానే ఇన్‌స్టాల్‌ అయి వస్తుంది. అయితే పాత ఐఫోన్ల వినియోగదారులకు కూడా కొన్నింటి వరకు ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అప్​డేట్​ అవుతుంది.

సెప్టెంబర్ 15, రాత్రి 10:30 గంటల నుంచి iOS వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇది 2019 తర్వాత విడుదలైన అన్ని ఐఫోన్లకు వర్తిస్తుంది.
2018లో వచ్చిన iPhone XR, XS, XS Max వంటి పాత మోడళ్లకు ఇకపై కొత్త అప్‌డేట్స్ రాకుండా, కేవలం iOS 18.7 సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే వస్తుంది.

iOS 26 అందుకునే ఫోన్జాబితా

  • iPhone 17 Series: iPhone 17, 17 Pro, 17 Pro Max, iPhone Air
  • iPhone 16 Series: iPhone 16, 16 Plus, 16e, 16 Pro, 16 Pro Max
  • iPhone 15 Series: iPhone 15, 15 Plus, 15 Pro, 15 Pro Max
  • iPhone 14 Series: iPhone 14, 14 Plus, 14 Pro, 14 Pro Max
  • iPhone 13 Series: iPhone 13, 13 mini, 13 Pro, 13 Pro Max
  • iPhone 12 Series: iPhone 12, 12 mini, 12 Pro, 12 Pro Max
  • iPhone 11 Series: iPhone 11, 11 Pro, 11 Pro Max
  • iPhone SE: 2nd Generation మరియు తర్వాతి మోడల్స్

ఆపిల్​ ఇంటెలిజెన్స్​ (AI ఆధారిత ఫీచర్లు) కేవలం iPhone 16 సిరీస్, iPhone 15 Pro, iPhone 15 Pro Maxలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

iOS 26లో కొత్త సౌలభ్యాలు

  1. ద్రవరూప గాజులా ఉంటే ఇంటర్​ఫేజ్​ (Liquid Glass Interface)
  • పూర్తిగా కొత్త UI డిజైన్.
  • లాక్‌స్క్రీన్, హోమ్‌స్క్రీన్, కంట్రోల్ సెంటర్ వరకు “గాజులా పారదర్శకంగా” ఉండే లుక్.
  • ఫ్లూయిడ్ ట్రాన్సిషన్స్, వేగవంతమైన యానిమేషన్స్.
  1. ఆపిల్​ ఇంటెలిజెన్స్​ (Apple Intelligence – AI ఇంటిగ్రేషన్)
  • Siri ఇప్పుడు ChatGPT తో కలిసిపోయి మరింత తెలివిగా పనులు చేసిపెడుతుంది.
  • FaceTime కాల్స్‌కి లైవ్ క్యాప్షన్స్, మెసేజెస్‌కి లైవ్ ట్రాన్స్‌లేషన్.
  • విజువల్​ ఇంటెలిజెన్స్​ ద్వారా Google Circle-to-Search మాదిరిగా డైరెక్ట్‌గా టెక్స్ట్, ఇమేజ్ గుర్తింపు.
  1. కాల్స్​ – మెసేజ్​లు (Calls & Messages)
  • Live Voicemail, Call Screening ఫీచర్లు.
  • మెసేజింగ్‌లో కొత్త ఎమోజీ రియాక్షన్స్, షెడ్యూల్డ్ మెసేజింగ్, స్టిక్కర్ టాప్‌బ్యాక్స్.
  • ప్రత్యేక Unknown Messages Folder..  గోప్యత కోసం.
  1. ఫోటోలు – జర్నల్​ (Photos & Journal)
  • ఫోటోస్ యాప్ రీడిజైన్ – కస్టమ్ కలెక్షన్లు, కారసెల్ హైలైట్స్, ఫాస్ట్ సెర్చ్.
  • Journal యాప్‌లో డాష్‌బోర్డ్, సెర్చ్, రైటింగ్ గోల్స్.
  1. వ్యాలెట్​ – మనీ (Wallet & Money)
  • Tap to Cash – రెండు ఐఫోన్లు దగ్గరగా ఉంచితే వెంటనే డబ్బు బదిలీ.
  • Walletలో ID Verification ఆప్షన్.
  1. ఉత్పాదకత – యాప్​లు (Productivity & Apps)
  • Passwords App – పాస్‌వర్డ్స్, Wi-Fi లాగిన్స్, పాస్‌కీస్ అన్నీ ఒకే యాప్‌లో.
  • Mail App – Primary, Transactions, Updates, Promotions అని ఆటోమేటిక్ కేటగరైజేషన్.
  • iPhone Mirroring on Mac – మీ Macలోనే iPhone పూర్తి కంట్రోల్.
  1. ఆటలు – వినోదం (Gaming & Entertainment)
  • Game Mode – లేటెన్సీ తగ్గించి గేమింగ్ పనితీరు పెంచుతుంది.
  • కొత్త Games App – గేమ్ యాక్టివిటీని ఒకేచోట చూపిస్తుంది.
  • Music Haptics – పాటల బీట్‌కు అనుగుణంగా వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్.
  1. Accessibility Features
  • కళ్లతో స్క్రీన్ కంట్రోల్ చేయడానికి Eye Tracking.
  • వాయిస్ ద్వారా ఆదేశాల కోసం Vocal Shortcuts.
  • Motion Cues – స్క్రీన్‌లో కదలికల వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

iPadOS 26 కూడా విడుదల

  • iPad Pro (M4 & 3rd Gen తరువాతి వెర్షన్స్)
  • iPad Air (3rd Gen & తరువాత)
  • iPad (8th Gen & తరువాత)
  • iPad mini (5th Gen & తరువాత)
    ఈ iPads‌లకు కూడా iPadOS 26 అందుబాటులోకి వచ్చింది.

మ్యాక్ఓఎస్ తాహో (macOS Tahoe)

MacBook using Repair Assistant feature for easy fixes

  • iPhones మాదిరిగానే Macలకు కూడా Liquid Glass UI ప్రవేశపెట్టబడింది. ఈ కొత్త ఇంటర్‌ఫేస్ మొత్తం సిస్టమ్‌ను మరింత ఆధునికంగా, పారదర్శకంగా చూపిస్తుంది. Spotlight సెర్చ్ వేగవంతం చేసారు. కొత్త Phone App ద్వారా మెసేజ్​లు, కాల్స్ మ్యాక్​ ద్వారా కూడా నియంత్రించవచ్చు.
  • అత్యంత ప్రాధాన్యత పొందిన ఫీచర్ Repair Assistant. దీని ద్వారా వినియోగదారులు లేదా అనధికారిక వర్క్‌షాప్‌లు కూడా చిన్నపాటి హార్డ్‌వేర్ మరమ్మత్తులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఖర్చు తగ్గించడానికి తోడ్పడుతుంది.
  • మరియు కొత్త Games App, మెరుగైన Shortcuts, Continuity అప్‌గ్రేడ్స్—all Mac మరియు iPhone మధ్య సులభమైన అనుసంధానాన్ని కల్పిస్తాయి. Apple Silicon Macs‌కు ఈ సౌలభ్యాలు మరింత బాగా కుదిరాయి.

వాచ్ఓఎస్ 26 (watchOS 26)

watchOS 26 Workout Buddy AI trainer feature on Apple Watch

  • ఆపిల్​ వాచ్​ వినియోగదారుల కోసం watchOS 26 లో కొత్త Workout Buddy AI ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇది వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్‌లా పనిచేసి వినియోగదారులకు వ్యాయామం గురించి విస్తృత సమాచారం ఇస్తుంది.
  • Hypertension Alerts అనే రక్తపోటు ట్రాకింగ్ సదుపాయం ఇప్పుడు Series 9 మరియు Ultra మోడల్స్ లో అందుబాటులో ఉంది. అలాగే Ambient Noise Detection, Messagesలో Live Translation, Smart Stack అప్‌డేట్స్ వంటివి ఈ కొత్త ఓఎస్​తో అందుబాటులోకి వచ్చాయి.
  • నోటిఫికేషన్లు, కాల్స్​, అలారమ్​లను కేవలం చేతిని పక్కకు తిప్పడం ద్వారా Alarms‌ను కేవలం wrist flick gesture ద్వారా కట్​ చేయగలిగే సౌకర్యం ఉంది. Notes యాప్ కూడా Watch‌లో కొత్తగా వచ్చిచేరింది.

ప్యాడ్ఓఎస్ (iPadOS 26)

New Liquid Glass UI design on iPadOS 26 home screen

  • iPads వినియోగదారుల కోసం iPadOS 26 ఒక పెద్ద అప్‌డేట్. ఇది కూడా Liquid Glass UI తో వస్తోంది. Stage Manager మరింత ఆధునీకరించబడింది. సపోర్ట్​ చేసే అన్ని ఐప్యాడ్​లలో విండో మల్టీటాస్కింగ్ సపోర్ట్ చేస్తుంది.
  • కొత్త విండో మేనేజ్‌మెంట్ ఫీచర్లు – Resizable Apps, టైల్డ్ విండోస్, Mac తరహా మెను బార్—అన్ని ఐప్యాడ్​లను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఆపిల్​ ఇంటెలిజెన్స్ కూడా కొన్ని మోడల్స్‌లో అందుబాటులో ఉంటుంది.
  • iPad Pro (M4 మరియు 3rd Gen తర్వాతి మోడల్స్), iPad Air (3rd Gen+), iPad (8th Gen+), iPad mini (5th Gen+) మోడల్స్ మాత్రమే ఈ కొత్త ఓఎస్​కు అప్‌డేట్‌అవుతాయి. పాత iPad 7th Genకు ఇక సపోర్ట్​ లేదు.

Apple ఈసారి iOS 26తో పాటు macOS Tahoe, watchOS 26, iPadOS 26 లను కూడా విడుదల చేసి ఒకేసారి సమగ్ర OS అనుకూల వ్యవస్థను అందించింది. Liquid Glass డిజైన్ నాలుగు ప్లాట్‌ఫారంలలోనూ ఒకే రకమైన అనుభవాన్ని ఇస్తుంది. ఆపిల్​ ఇంటెలిజెన్స్ ద్వారా AI ఆధారిత సౌకర్యాలు ఇప్పుడు iPhone, Mac, iPad, Watch‌లలో విస్తరించి వినియోగదారులకు మరింత వ్యక్తిగత, సమర్థవంతమైన అనుభవాన్ని ఇవ్వబోతున్నాయి.