Ghiblify  | సోషల్‌ మీడియాలో లేటెస్ట్‌ ట్రెండ్‌.. మీ ఫొటోలను ఘిబ్లిఫై చేసుకోండిలా..

మీ బొమ్మలు కార్టూన్‌ సినిమాల్లోని బొమ్మల్లా కావాలా? ప్రఖ్యాత జపనీస్‌ స్టూడియో అయిన ఘిబ్లి స్టూడియో తరహాలో అవి ఉండాలా.. అయితే ఒక వైరల్‌ ఫీచర్‌ను చాట్‌జీపీటీ అందుబాటులోకి తెచ్చింది.

Ghiblify  | సోషల్‌ మీడియాలో లేటెస్ట్‌ ట్రెండ్‌.. మీ ఫొటోలను ఘిబ్లిఫై చేసుకోండిలా..

Ghiblify  | ఘిబ్లిఫై.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ ట్రెండ్‌. మన ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తే.. కార్టూన్‌ రూపంలో ఆ బొమ్మలు తిరిగి మనకు అందుతాయి. ఈ మధ్యకాలంలో ఇంతగా పాపులర్‌ అయిన ట్రెండ్‌ ఇదేనంటున్నారు. అదే స్టూడియో ఘిబ్లి స్టైల్‌ ఆర్ట్‌వర్క్‌. ఈ మధ్య ప్రధాన నరేంద్రమోదీకి చెందిన ఫొటోలను కొందరు ఘిబ్లిఫై చేయగా.. తాజా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇతర అనేక మంది ఫొటోలను నెటిజన్లు రూపు మార్చి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఆ ఫొటోలు కూడా ముచ్చటగొల్పుతున్నాయి. కార్టూన్‌ చిత్రాల కథల పుస్తకంలో ఉండే చిత్రాల్లో మనల్ని మనం చూసుకుని మురిసిపోవచ్చు.

స్టూడియో ఘిబ్లి.. ప్రఖ్యాత జపనీస్‌ యానిమేషన్‌ స్టూడియో. దీనిని 1985లో నెలకొల్పారు. చేతితో బొమ్మలు వేసి, యానిమేషన్‌ సినిమాలకు అందించేది ఈ స్టూడియో. అది రూపొందించిన చిత్రాల తరహాలో మన చిత్రాలు కూడా మార్చుకునే ఫీచర్‌ను ఇప్పుడు ప్రఖ్యాత ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ అందుబాటులోకి తెచ్చింది. చాలా సులభంగా ఇమేజ్‌లు మారుతుండటంతో నెటిజన్లు కూడా చాట్‌జీపీటీకి పోటెత్తుతున్నారు. దీంతో ఇమేజ్‌ల సంఖ్యపై చాట్‌జీపీటీ పరిమితులు విధించింది. రద్దీ కారణంగానే ఈ పరిమితిని విధించామని, త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించింది. నెటిజన్లు పోటెత్తుతుండటంతో తమ జీపీయూలు కరిగిపోతున్నాయని, అందుకే తాత్కాలికంగా ఇమేజ్‌ల సంఖ్యపై పరిమితి పెట్టామని ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ ఎక్స్‌లో తెలిపారు. రోజుకు 3 ఇమేజ్‌లను ఇప్పటికి మార్చుకోవచ్చు.

ఘిబ్లి స్టైల్‌ ఇమేజ్‌లు ఇలా..

స్టెప్‌ 1: చాట్‌జీపీటీకి లాగ్‌ ఆన్‌ అవండి.
స్టెప్‌ 2 : కింద వచ్చే ప్రాంప్ట్‌ బాక్స్‌లో + సింబల్‌ను క్లిక్‌ చేసి మీ ఫొటోను అప్‌లోడ్‌ చేయండి.
స్టెప్‌ 3 : ‘Ghiblify this’ లేదా ‘turn this image in Studio Ghibli theme’ అని టైప్‌ చేయండి.
స్టెప్‌ 4 : మీరు కోరుకున్న ఘిబ్లి స్టైల్‌ చిత్రం వస్తుంది. దానిని మీ డివైజ్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోండి.