K2-18B | ఈ విశ్వంలో భూమి మీదున్న మనుషులు ఒంటిరి వారు కాదని.. ఎక్కడో ఒకచోట జీవం ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకోసం సంవత్సరాల తరబడిగా విశ్వంలో శోధిస్తున్నారు. ఇప్పటి వరకు భూమిని పోలిన గ్రహాలను గుర్తించారు. అందులో జీవం ఉండి ఉండవచ్చని పేర్కొనగా.. కానీ, అందులో జీవం ఉన్నట్లుగా ఖచ్చితమైన ఆధారాలు మాత్రం దొరకలేదు. అయితే, తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు భూమి తరహాలో జీవకోటి మనుగడకు అనువైన మరో గ్రహాన్ని గుర్తించారు.
K2-18B | ఈ విశ్వంలో భూమి మీదున్న మనుషులు ఒంటిరి వారు కాదని.. ఎక్కడో ఒకచోట జీవం ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకోసం సంవత్సరాల తరబడిగా విశ్వంలో శోధిస్తున్నారు. ఇప్పటి వరకు భూమిని పోలిన గ్రహాలను గుర్తించారు. అందులో జీవం ఉండి ఉండవచ్చని పేర్కొనగా.. కానీ, అందులో జీవం ఉన్నట్లుగా ఖచ్చితమైన ఆధారాలు మాత్రం దొరకలేదు. అయితే, తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు భూమి తరహాలో జీవకోటి మనుగడకు అనువైన మరో గ్రహాన్ని గుర్తించారు. ఇందులో ప్రాణికోటికి అవసరమయ్యే పరిస్థితులు ఉన్నాయని.. భూమికి సుదూర నక్షత్ర మండలంలో ఉన్న ఓ గ్రహంలో జీవం ఉందనడానికి ప్రాథమిక ఆధారాలు లభించినట్లుగా నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించిందని పేర్కొంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించిన రెడ్ డ్వార్ఫ్ స్టార్‌కు నాసా బృందం ‘కే2-18బీ’గా పేరుపెట్టింది. టెలిస్కోప్ పంపిన సమాచారాన్ని మరింత నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన డాక్టర్ నిక్కు మధుసూధన్ పేర్కొన్నారు. అయితే, ఇప్పుడే తొందరపడి ఓ అంచనాకు రాలేమన్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కే2-18బీ నక్షత్రంలో డైమిథైల్ సల్ఫైడ్ (DMS) వాయువు ఆనవాళ్లను గుర్తించినట్లుగా నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్యాస్ కేవలం ప్రాణకోటితో మాత్రమే ఉత్పత్తి అవుతుందని.. నిర్జీవ గ్రహాలపై ఈ వాయువు ఉండే అవకాశం లేదని పేర్కొన్నారు. వాతావరణంలో మరేరకంగా డైమిథైల్ సల్ఫైడ్ ఉత్పత్తి అయ్యేందుకు అవకాశం లేదని చెప్పారు.
కే2-18బీ నక్షత్రంపై గ్యాస్ ఉందని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించడంతో అక్కడ జీవం ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనాకు వస్తున్నారు. టెలిస్కోప్ పంపిన వివరాలపై మరిన్ని పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందని నాసా సైంటిస్టులు పేర్కొన్నారు. కే2-18బీ నక్షత్రం మిల్కీవే గెలాక్సీలో ఉన్న భూమికి దాదాపు 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని తెలిపారు. వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్ విశ్వంలో గంటకు 38 వేల మైళ్ల స్పీడ్‌తో దూసుకెళ్తుంది. అదే స్పీడ్‌తో ఈ నక్షాత్రాన్ని మనం చేసుకునేందుకు సుమారు 22లక్షల సంవత్సరాల పడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.