Samsung Unpacked| శాంసంగ్ అన్ ప్యాక్డ్ రెడీ…అద్భుత ఫీచర్లతో కొత్త ఫోన్లు

విధాత : సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ నుంచి ఈ నెల 9న అధ్బుతమైన కొత్త ఫోన్ రాబోతుంది. శాంసంగ్ సంస్థ ఏటా కొత్త ఉత్పత్తులు స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విడుదల చేసే ఈవెంట్ ను ఈనెల 9న నిర్వహిస్తుంది. శాంసంగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ లో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు ( Galaxy Z Fold 7, Galaxy Z Flip 7 ), స్మార్ట్ రింగ్, ఇయర్ బడ్స్, ఏఐ బేస్డ్ ఫ్రీజ్, వాషింగ్ మిషన్లు, ఇతర గ్యాడ్జెట్‌లను లాంచ్ చేయబోతుంది. Samsung Galaxy Z Fold 7, Samsung Galaxy Z Flip 7 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ గత ఏడాది విడుదలైన Samsung Galaxy Z Fold 6, Samsung Galaxy Z Flip 6 కి అడ్వాన్స్డ్ వెర్షన్స్ గా రానున్నాయి.
లీక్ అయిన సమాచారం మేరకు స్పెసిఫికేషన్స్ చూస్తే Samsung Galaxy Z Fold 7 ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో పాటు 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం, 6.5 ఇంచ్ కవర్ స్క్రీన్ తో కూడిన 8.6 ఇంచ్ ఫోల్డబుల్ డైనమిక్ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ ప్లే, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 1,69,990 లు ఉండే అవకాశముంది. ఇకపోతే Samsung Galaxy Z Flip 7 ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో పాటు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 4174 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం, 6.85 ఇంచ్ ఫోల్డబుల్ డైనమిక్ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ ప్లే, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 1,42,990 లుగా ఉండే అవకాశముంది. ఈవెంట్ సందర్భంగా ఫ్రీ బుకింగ్ కోసం రూ.5,999ఓచర్ ఆఫర్ అందిస్తున్నారు. ఈవెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఐదుగురు లక్కీ విన్నర్లకు రూ.50వేలు ఓచర్ ఆఫర్ ఇచ్చింది.
💙 like this post and be the first to witness what’s next on Galaxy Unpacked. Something new is unfolding—and yes, it’s worth the wait 😉😉 This is the upgrade you’ve been waiting for.
Pre-reserve now https://t.co/d0DZOHKb9F and get benefits up to ₹ 5999*. *T&C apply. pic.twitter.com/gMvWTayGXR— Samsung India (@SamsungIndia) June 27, 2025