Telegram | యూజర్లకు గుడ్‌న్యూస్‌..! వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను తలదన్నేలా సరికొత్త ఫీచర్‌ తీసుకువస్తున్న టెలిగ్రామ్‌..!

Telegram | ప్రముఖ మెసెంజర్ టెలిగ్రామ్ త్వరలోనే యూజర్స్‌కు త్వరలోనే సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు యాప్స్‌కు చెక్‌ పెట్టేలా సరికొత్త ఫీచర్లను పరిచయం చేయబోతున్నది. యూజర్ల విజ్ఞప్తి మేరకు ఫీచర్‌ను పరిశీలిస్తున్నట్లు టెలిగ్రామ్‌ వెల్లడించింది. ఆ ఫీచర్‌ అంటంటే.. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ స్టేటస్‌ తరహాలో స్టోరీస్‌ పేరుతో టెలిగ్రామ్‌ ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. ఈ స్టోరీస్‌లో యూజర్లు ఫొటోలు, వీడియోలు, వెబ్‌లింకులు, టెక్ట్స్‌ను సైతం షేర్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. దాంతో పాటు […]

Telegram | యూజర్లకు గుడ్‌న్యూస్‌..! వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను తలదన్నేలా సరికొత్త ఫీచర్‌ తీసుకువస్తున్న టెలిగ్రామ్‌..!

Telegram | ప్రముఖ మెసెంజర్ టెలిగ్రామ్ త్వరలోనే యూజర్స్‌కు త్వరలోనే సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు యాప్స్‌కు చెక్‌ పెట్టేలా సరికొత్త ఫీచర్లను పరిచయం చేయబోతున్నది. యూజర్ల విజ్ఞప్తి మేరకు ఫీచర్‌ను పరిశీలిస్తున్నట్లు టెలిగ్రామ్‌ వెల్లడించింది. ఆ ఫీచర్‌ అంటంటే.. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ స్టేటస్‌ తరహాలో స్టోరీస్‌ పేరుతో టెలిగ్రామ్‌ ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. ఈ స్టోరీస్‌లో యూజర్లు ఫొటోలు, వీడియోలు, వెబ్‌లింకులు, టెక్ట్స్‌ను సైతం షేర్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది.

దాంతో పాటు ఫొటోలు, వీడియోలను సైతం ఎడిట్‌ చేసుకునేందుకు టూల్స్‌ సైతం ఉండనున్నాయి. దాంతో పాటు క్యాప్షన్‌ను సైతం యాడ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే, స్టోరీ ఫీచర్‌ను యూజర్లు ఎవరు చూడాలి? ఎవరు చూడకూడదో సెట్‌ చేసుకునేలా ప్రైవసీకి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టెలిగ్రామ్‌ పేర్కొంది. స్టోరీ అందరికీ కనిపించేలా.. లేదంటే కాంటాక్టు లిస్ట్‌లోని నంబర్లు, ఎంపిక చేసుకున్న యూజర్లకు కనిపించేలా సెట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది.

ఈ ఫీచర్‌ యూజర్లు కోరుకున్న విధంగా అన్ని ఆప్షన్‌తో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. అలాగే స్క్రీన్ స్పేస్‌ను ఆప్టిమైజ్ చేసేందుకు టెలిగ్రామ్ స్టోరీస్ ఆప్షన్ చాట్ లిస్ట్‌పై ఎక్సాపాన్షన్ సెక్షన్‌లో ఉండనున్నట్లు సమాచారం. యూజర్ ఇంటర్‌ఫేస్ చాట్ ప్లేస్‌తో రాజీపడుకుండా ఈ ఆప్షన్ యాక్సెస్ చేసేలా ఉంటుందని టెలిగ్రామ్ తెలిపింది. హిడెన్ లిస్టులోకి దీన్ని మూవ్ చేసుకునేలా ఆప్షన్ సైతం అందుబాటులో ఉంటుంది. అలాగే స్టోరీ ఎంత సేపు కనిపించాలో టైమ్‌ను సైతం ఎంపిక చేసుకునే ఆప్షన్‌ కూడా ఉండనున్నది.

ఆరు, 12, 24, 48 గంటలు, ప్రొఫైల్‌ పేజీలో శాశ్వతంగా స్టోరీ కనిపించేలా ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా టెలిగ్రామ్ సహాయంతో వినియోగదారులు తమ సన్నిహితుల నుంచి కంటెంట్‌ను చూడడవచ్చని, గ్రూప్స్‌, చానెల్‌ ద్వారా పోస్టును ఇతరులకు షేర్‌ చేయవచ్చని టెలిగ్రామ్‌ వివరించింది. ప్రస్తుతం స్టోరీ ఫీచర్‌ వివిధ దశల్లో టెస్టింగ్‌లో ఉంది. విజయవంతమైతే జులై ప్రారంభంలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.