ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి శనివారం.. సీడబ్ల్యుసీ భేటీకి హాజరు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి రేవంత్‌రెడ్డి హాజరవుతారు. రేవంత్ రెడ్డితో పాటు నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు.

విధాత : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి రేవంత్‌రెడ్డి హాజరవుతారు. రేవంత్ రెడ్డితో పాటు నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ సీనియర్ నేతలు, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు దామోదర రాజనర్సింహ, చల్లా వంశీ చంద్ రెడ్డిలు సైతం సీడబ్ల్యుసీ భేటీకి హాజరుకానున్నారు. సీఎం తన ఢిల్లీ పర్యటనలో కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవి, కార్పొరేషన్ పదవుల భర్తీ వంటి కీలక అంశాలపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశముందని తెలుస్తుంది. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఎనిమిది సీట్లకే పరిమితమైన తీరు..బీఆరెస్ పతనం..బీజేపీ పుంజుకోవడం వంటి పరిణామాలపై కూడా ఢిల్లీ పార్టీ పెద్దలకు రేవంత్ బృందం వివరించవచ్చని సమాచారం.