Hanamkonda : వామ్‌అప్ చేస్తూ పదోతరగతి విద్యార్థి మృతి
హనుమకొండలో తేజస్వీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి జయంత్ వర్ధన్ వామ్‌అప్ సమయంలో కుప్పకూలి ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు.
విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండలోని నయీం నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. తేజస్వీ హై స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలేపల్లి జయంత్ వర్థన్ అనే బాలుడు పాఠశాలలో ఆటలు ఆడే సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. వామ్‌అప్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో పాఠశాల సిబ్బంది ఆ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాలుడి ముక్కు, చెవిలోనుంచి రక్త స్రావం జరిగినట్లు గుర్తించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బాలుడి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు అకాలమరణం చెదడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరౌతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram