కోల్ కతా లో జరిగిన 11వ వేజ్ బోర్డు మొదటి సమావేశం

విధాత‌: బొగ్గు గని కార్మికుల వేతనాలు, అలవెన్సుల పెంపుదల కోసం శనివారం కోల్ కతా లో జరిగిన 11వ వేజ్ బోర్డు మొదటి సమావేశం వివరాలను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి,వేజ్ బోర్డు పర్మనెంట్ మెంబర్ వాసిరెడ్డి సీతారామయ్య తెలిపినాడు. ముఖ్యంగా ఈ సమావేశంలో కోల్ ఇండియా సి&ఎం.డి మాట్లాడుతూ వేజ్ బోర్డు కాలపరిమితి ఐదు సంవత్సరాలు గాని, పది సంవత్సరాలు గాని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దాని ప్రకారం జీతాలు పెంచుతామని సమావేశంలో […]

కోల్ కతా లో జరిగిన 11వ వేజ్ బోర్డు మొదటి సమావేశం

విధాత‌: బొగ్గు గని కార్మికుల వేతనాలు, అలవెన్సుల పెంపుదల కోసం శనివారం కోల్ కతా లో జరిగిన 11వ వేజ్ బోర్డు మొదటి సమావేశం వివరాలను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి,వేజ్ బోర్డు పర్మనెంట్ మెంబర్ వాసిరెడ్డి సీతారామయ్య తెలిపినాడు. ముఖ్యంగా ఈ సమావేశంలో కోల్ ఇండియా సి&ఎం.డి మాట్లాడుతూ వేజ్ బోర్డు కాలపరిమితి ఐదు సంవత్సరాలు గాని, పది సంవత్సరాలు గాని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దాని ప్రకారం జీతాలు పెంచుతామని సమావేశంలో చర్చ జరిగిందని ఆయన పేర్కొన్నాడు. ఐదు సంవత్సరాలు అయితే అధికారుల జీతం కంటే కార్మికుల జీతం ఎక్కువగా ఉండటానికి వీల్లేదని కోల్ ఇండియా యాజమాన్యం తెలిపిందని ఆయన అన్నారు. అగ్రిమెంట్ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని ప్రకటిస్తామని తెలిపారని ఆయన అన్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో కొల్ ఇండియా, సింగరేణి ల ఉత్పత్తి , ఆర్థిక పరిస్థితి ల వివరాలు ఆయా యాజమాన్యాలు తెలిపాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి , వేజ్ బోర్డు పర్మనెంట్ మెంబర్ కామ్రేడ్ రామింద్ర కుమార్ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెరగాలని , వేజ్ బోర్డు కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఉండాలని, జనవరి 2017 నుండి ఇరవై లక్షల సర్వీస్ గ్రాట్యూటి ని అమలు చేయాలని, రిటైర్మెంట్ ఐన కార్మికుల కు పెన్షన్ ను రివైజ్ చేయాలని, లీవు పెట్టకుండా 75 వేల రూపాయలు ఎల్ఎల్టీసి, యాభై వేల రూపాయలు ఎల్టీసి ఇవ్వాలని, అదేవిధంగా కరువు భత్యం పాయింట్ లతో సంబంధం లేకుండా 100 శాతం న్యూట్రలైజ్ చేసి 50 శాతం జీతాలతో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కరోనాతో చనిపోయినవారికి, యాక్సిడెంట్ లో చనిపోయిన పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. కోల్ ఇండియా అగ్రిమెంట్లు కూడా సింగరేణి లో అమలు పరచాలని డిమాండ్ చేయడం జరిగిందని, కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియా మాదిరి గా సింగరేణి లో హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని కోరడం జరిగిందని ఆయన అన్నారు. డిపిఇ గైడ్ లైన్స్ తో సంబంధం లేకుండా వేజ్ బోర్డు లో వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడం జరిగిందని ఆయన అన్నారు.ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కోల్ ఇండియా ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ త్వరలోనే 11వ వేజ్ బోర్డు ను పరిష్కరిస్తామని తెలిపారని, కోల్ ఇండియా లో 51శాతం కార్మికుల కు వేతనాలు, సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని తెలుపడం జరిగిందని ఆయన పేర్కొన్నారు అదెవిధంగ సింగరేణి లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు కరోనాతో మరణిస్తే వారి కుటుంబాలకు 15 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని సింగరేణి డైరెక్టర్ పైనాన్స్, ఫా బలరాం అంగీకరించారని ఆయన తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో కోల్ ఇండియా, సింగరేణి కి చెందిన అధికారులు, ఆయా కార్మిక సంఘాల వేజ్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.