మంథనిలో మధూకర్ సమక్షంలో బీఆరెస్‌లో చేరికలు
విధాత, పెద్దపల్లి: మంథని నియోజకవర్గంలోని మహాముత్తారం, మల్హర్, కాటారం మండలాలకు చెందిన సుమారు 150 మంది మున్నా సైన్యం యువకులు మంగళవారం మంథనిలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా మధూకర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని, గొప్పగా ఆలోచన చేస్తూ భవిష్యత్తులో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రేపటి తరాలకు మార్గదర్శకులుగా నిలిచే యువత, నేటి సమాజంలోని వాస్తవ విషయాలపై చర్చించి ప్రజలకు అవగహన కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, బీఆర్‌ఎస్ గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram