Nagarjuna sagar | నాగార్జున సాగర్ 26క్రస్ట్ గేట్ల ఎత్తివేత.. దిగువకు కృష్ణమ్మ పరవళ్లు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాశయం 26క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఎగువన శ్రీశైలం జలాశయ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్ ప్రాజెక్టు మొత్తం 26గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు

విధాత, హైదరాబాద్ : నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాశయం 26క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఎగువన శ్రీశైలం జలాశయ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్ ప్రాజెక్టు మొత్తం 26గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ జలసోయగాలు వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
సాగర్ నుంచి దిగువన పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండగా పులిచింతల పూర్తి స్థాయి నీటి మట్టంకు చేరుకోవడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీరు భారీగా సముద్రంలో చేరుతుంది. సాగర్ ప్రాజెక్టు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 312టీఎంసీలకు 298టీఎంసీలకు, 590అడుగులకు 585అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 3లక్షల 55వేల క్యూసెక్కుల మేరకు వస్తుండగా, దిగువకు 3లక్షల 55వేల క్యూసెక్కులు వదులుతున్నారు