మానేరు డ్యామ్ లో మహా చేప…30కిలోలు !

రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు డ్యామ్‌లో మత్స్యకారుల వలకు 30 కిలోల భారీ బొచ్చ చేప చిక్కింది. ఈ భారీ చేప ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వర్షాల సీజన్ నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువులు, నదులలో చేపల వేట కూడా పెరిగింది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు ప్రాజెక్టు నీటిలో మత్స్యకారులకు ఏకంగా 30కిలోల భారీ బొచ్చ చేప మత్స్యకారులకు చిక్కింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఆరు రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నుంచి మధ్య మానేరు ప్రాజెక్ట్‌కు నీరు వస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతంలో మత్స్యకారులు చేపలు పడుతున్నారు. ఒకేసారి 30కిలోల భారీ చేప వలకు చిక్కడంతో మత్స్యకారుడు రాజ్‌కుమార్‌ తోటి జాలర్ల సాయంతో పట్టుకున్నారు. అటు ఏపీలోనూ గోదావరి వరదల నేపధ్యంలో జాలరులకు పులాస చేపలు చిక్కుతుండటంతో వాటికి మార్కెట్ లో మంచి డిమాండ్ లభిస్తుంది.

Latest News