Hyderabad | లంచం తీసుకుంటున్న భార్యను పట్టించిన భర్త.. విడాకులిచ్చి లంచం వీడియోలు విడుదల
లంచాలకు( Bribe ) మరిగిన ప్రభుత్వ అధికారులను ఏసీబీ అధికారులు( ACB Officers ) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు.

Hyderabad | హైదరాబాద్ : లంచాలకు( Bribe ) మరిగిన ప్రభుత్వ అధికారులను ఏసీబీ అధికారులు( ACB Officers ) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. కానీ ఓ భర్త( Husband )నే ఏసీబీ అధికారిగా మారి.. రోజుకు లక్షల రూపాయాలు లంచం తీసుకొని ఇంటికి వస్తున్న భార్య( Wife )ను అధికారులకు పట్టించాడు. లంచాలకు మరిగిన భార్యను ఏసీబీ అధికారులకు పట్టించిన భర్తపై బాధితులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్( Hyderabad ) నగరం పరిధిలోని మణికొండ మున్సిపల్( Manikonda Municipal ) డీఈఈగా దివ్యజ్యోతి( Divya Jyothi ) విధులు నిర్వర్తిస్తున్నారు. దివ్యజ్యోతికి భర్త శ్రీపాద్ ఉన్నాడు. అయితే దివ్యజ్యోతి ప్రతి రోజు లంచంగా తీసుకున్న లక్షల రూపాయాలను ఇంటికి తీసుకొచ్చి, ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది. లంచాల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే అవకాశం దొరికినప్పుడల్లా.. ఇంట్లో డబ్బులు ఎక్కడెక్కడ దాచిపెట్టిందో.. వాటన్నింటిని శ్రీపాద్ వీడియోలు తీశాడు.
ఇక తన భార్య లంచాలకు విసిగిపోయిన శ్రీపాద్.. ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం భార్య లంచాల వీడియోలను బయటపెట్టాడు. లంచం తీసుకోవద్దని, అక్రమ డబ్బు మంచిది కాదని చెప్పిన ప్రతీసారి తన భార్య తనను తిట్టేదని, హింసించేదని భర్త శ్రీపాద్ వాపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లంచం తీసుకుంటున్న భార్యను పట్టించిన భర్త శ్రీపాద్
మనికొండ మున్సిపల్ డీఈఈగా పని చేస్తున్న దివ్యజ్యోతిని మీడియాకు పట్టించిన భర్త శ్రీపాద్.
ప్రతి రోజు తన భార్య దివ్యజ్యోతి అక్రమంగా లక్షలలో లంచం తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుందని, తప్పంటే నన్ను తిట్టేదని వీడియోలు తీసి… pic.twitter.com/dz6v5sXsCe
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2024