R Narayana Murthy | సీనియర్ నటుడు ఆర్‌. నారాయణమూర్తికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

తెలుగు సినిమా సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఆయనను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

R Narayana Murthy | సీనియర్ నటుడు ఆర్‌. నారాయణమూర్తికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

విధాత, హైదరాబాద్ : తెలుగు సినిమా సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఆయనను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్. నారాయణముర్తి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. విప్లవ కథా చిత్రాలకు మారుపేరుగా ముద్ర వేసుకున్న ఆర్‌. నారాయణమూర్తి చిత్ర పరిశ్రమలో లాభనష్టాలకు అతీతంగా తను నమ్మిన సైద్ధాంతిక బాటలో ప్రజల్లో చైతన్యం నింపే చిత్రాలను నిర్మిస్తు, నటిస్తూ వస్తున్నారు. నారాయణమూర్తి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.