AISF | ఉప్పల ఉదయ్‌ను వెంటనే విడుదల చేయాలి : ఏఐఎస్ఎఫ్
ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా విద్యార్థి నాయకుడు ఉప్పల ఉదయ్‌ను వెంటనే విడుదల చేయాలి అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
విధాత, హైదరాబాద్ :
ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా విద్యార్థి నాయకుడు ఉప్పల ఉదయ్‌ను వెంటనే విడుదల చేయాలి అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై నిత్యం పోరాడుతున్న ఉదయ్ కుమార్ పై ఓయూ అధికారులు నియంతృత్వంగా వ్యవహరిస్తూ డిప్యూటీ రిజిస్ట్రార్ శారద ఫిర్యాదు మేరకు కేసు పెట్టి అరెస్టు చేయడాన్ని ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా రాష్ట్ర సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే అరెస్టు చేసిన ఉదయ్ కుమార్ ని బేషరతుగా విడుదల చేయడంతో పాటు అదేవిధంగా కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నించే విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న ఉస్మానియా అధికారుల తీరుపై పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం, హక్కుల రక్షణకు భంగం కలిగించకుండా 8వ గ్యారంటీగా అమలు చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మరోవైపు విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధి సమస్యలపై గళం విప్పుతున్న విద్యార్ధి సంఘాల నాయకులపై అధికారులు కుట్రలు పన్నుతున్నదన్నారు. తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులతో నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram