‘ప్రజాపాలన’మరిచి ‘దాడుల పాలన’: కాంగ్రెస్ పై ఆకుల ఫైర్

ప్రజాపాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాడుల పాలన సాగిస్తుందని బీజేపీ నాయకురాలు ఆకుల శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో కర్ర(ఆర్ఎస్ఎస్ దండ) పట్టుకుని కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇస్తూ ఆమె ఎక్స్ లో ఓ వీడియో పోస్తు చేశారు.

విధాత, హైదరాబాద్ : ప్రజాపాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాడుల పాలన సాగిస్తుందని బీజేపీ నాయకురాలు ఆకుల శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో కర్ర(ఆర్ఎస్ఎస్ దండ) పట్టుకుని కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇస్తూ ఆమె ఎక్స్ లో ఓ వీడియో పోస్తు చేశారు. కాంగ్రెస్ వాళ్లకు ఈ దండ ఏంటో తెలిసే ఉంటుంది అనుకుంటున్నానని, ఇది బాగా ట్రెయిన్ అయిన దండన్నా… ఊరికే ఎవరి దగ్గరికీ వెళ్లదు. కానీ మా మీద దాడి చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకునే టైప్ కాదు. దీని ప్రతాపం ఏంటో కచ్చితంగా చూపిస్తాం! అన్నారు. నిన్న నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పిరికిపంద చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు.

ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెట్టింది ప్రతిపక్ష కార్యాలయాలపై దాడులు చేయడానికి కాదు! అని, మీ హీరోయిజం చూపించడానికి కాదు! అని, ప్రజలకు పరిపాలన అందించడానికి అని గుర్తు పెట్టుకోవాలన్నారు. కానీ దురదృష్టవశాత్తు ‘ప్రజాపాలన’ను పక్కన పెట్టి ‘దాడుల పాలన’పై మీకు ఎక్కువ ఆసక్తి ఉన్నట్టుందని శ్రీవాణి విమర్శించారు.

బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని, మా కార్యాలయాలపై దాడులు చేసి, మా కార్యకర్తలను బెదిరించి మమ్మల్ని భయపెట్టగలమని అనుకుంటే అది మీ భ్రమ అని, మాకు దమ్ముంది. ధైర్యం ఉంది అని, ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని ఎదుర్కొనే సత్తా ఉందన్నారు. దొంగచాటుగా వచ్చి కార్యాలయాలపై దాడులు చేయడం ధైర్యం కాదు అని, అది పిరికితనం అని విమర్శించారు.

మీకు నిజంగా రాజకీయ దమ్ముంటే ప్రజల మధ్యకు రండి అని, డేట్, టైమ్ ఫిక్స్ చేయండని రెండు పార్టీల మధ్య ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఖాళీగా ఉందన్నారు. మీ పాలనపై బహిరంగ చర్చకు రండి. మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ప్రజల ముందే తేల్చుకుందాం అన్నారు. ఎవరి దగ్గర నిజమైన దమ్ముందో, ఎవరి దగ్గర ప్రజాబలం ఉందో! చూద్దాం అని సవాల్ చేశారు.

బీజేపీ కార్యాలయాలపై దాడులు చేస్తే భయపడేది లేదు. బెదిరిస్తే వెనక్కి తగ్గేది లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా ప్రతి చర్యకు గట్టి సమాధానం ఉంటుంది. అనన్నారు. అధికార మదంతో ప్రతిపక్షంపై దాడులు చేయడం మానేసి, ప్రజలు మీకు అప్పగించిన పరిపాలన బాధ్యతను నిర్వర్తించండని హితవు పలికారు.

 

Latest News