Woman Murder | మహిళా మర్డర్ కేసులో ‘బీర్’ సీసానే సాక్ష్యం..! నిందితుడి అరెస్టు ఇలా..!!
Woman Murder | ఓ మహిళా మర్డర్( Woman Murder )కేసులో మద్యం సీసా( Alcohol Bottle ) నే సాక్ష్యంగా నిలిచింది. సదరు మహిళా హత్య కేసును ఛేదించడంలో మద్యం సీసా కీలకమైంది. 20 నెలల క్రితం జరిగిన మర్డర్ కేసు( Murder Case )ను మద్యం సీసాపై ఉన్న వేలిముద్రల( Finger Prints ) ఆధారంగా ఛేదించారు.
Woman Murder | ఓ మహిళా మర్డర్( Woman Murder )కేసులో మద్యం సీసా( Alcohol Bottle ) నే సాక్ష్యంగా నిలిచింది. సదరు మహిళా హత్య కేసును ఛేదించడంలో మద్యం సీసా కీలకమైంది. 20 నెలల క్రితం జరిగిన మర్డర్ కేసు( Murder Case )ను మద్యం సీసాపై ఉన్న వేలిముద్రల( Finger Prints ) ఆధారంగా ఛేదించారు. ఇటీవల హైదరాబాద్( Hyderabad ) నగర శివారులో వృద్ధ దంపతులను హత్య చేసిన నిందితుడే.. 20 నెలల క్రితం జరిగిన మర్డర్ కేసులో కూడా నిందితుడని పోలీసులు తేల్చారు. మద్యం సీసాపై ఉన్న వేలిముద్రలే అతన్ని పట్టించాయి.
కందుకూరు( Kandukuru )లోని ఓ ఫామ్ హౌజ్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా( Nagarkurnool ) పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన మూగ ఉషయ్య(70), భార్య శాంతమ్మ(60) గత రెండేండ్ల నుంచి కాపలా ఉంటున్నారు. ఈ నెల 15న అర్ధరాత్రి ఈ వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఘటనాస్థలిలో పడి ఉన్న సెల్ ఫోన్( Cell Phone ) ఆధారంగా కేసును ఛేదించి, నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని దాసర్లపల్లికి చెందిన ఉప్పుల శివకుమార్‌గా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న అతను వృద్ధురాలిపై అత్యాచారం చేసేందుకు యత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది.
20 నెలల క్రితం మహిళ మర్డర్ కేసులో..
వృద్ధ దంపతుల హత్య కేసులో విచారణ చేస్తుండగా.. ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న మహిళ మర్డర్ కేసులో ఇతని పాత్ర ఉండొచ్చని పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. ఆ మహిళను కూడా శివకుమార్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నెల్లూరు జిల్లా ఓజిలి మండలానికి చెందిన చెంచు శైలజారెడ్డి (42), భర్త కృష్ణారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి 2011లో రంగారెడ్డి జిల్లాలోని కందుకూరుకు వచ్చి దాసర్లపల్లిలోని అరుణ్ ఫామ్ హౌస్‌లో పనికి కుదిరారు. అయితే, 2023 మార్చి 3న కృష్ణారెడ్డి, పిల్లలు బయటకు వెళ్లగా.. శైలజారెడ్డి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. అప్పటికే ఆమెపై కన్నేసిన ఉప్పుల శివకుమార్.. ఫాం హౌస్‌కు వెళ్లి ఆమెను బలవంతం చేయబోయాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. ఈ క్రమంలోనే మహిళను కత్తితో నరికి చంపాడు.
మద్యం సీసా పట్టించింది
మహిళను చంపేసిన అనంతరం అక్కడే మద్యం సీసా కనిపించగా తాగేందుకు యత్నించాడు. ఈ క్రమంలో సీసా కింద పడి పగిలిపోయింది. దానిపై నిందితుడి వేలిముద్రలు పడ్డాయి. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారు కాగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసాపై వేలిముద్రలు తప్ప ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ క్రమంలోనే వాటిని భద్రపరచగా.. ఇప్పుడు అతని వేలిముద్రలతో వాటిని పోల్చారు. శైలజారెడ్డి మర్డర్ కేసులోనూ నమోదైన వేలిముద్రలతో నిందితుని వేలిముద్రలు సరిపోలగా.. 2 కేసుల్లోనూ నిందితుడు ఒకడే అని పోలీసులు తేల్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram